Asianet News TeluguAsianet News Telugu

కుర్చీని మ‌డ‌త‌పెట్టి.. విరాట్ కోహ్లీ-అనుష్క‌ల డాన్స్ అదిరిపోయిందిగా.. ! వీడియో

Virat Kohli - Anushka Sharma dance: భార‌త స్టార్ క‌పుల్ విరాట్ కోహ్లీ-అనుష్క శ‌ర్మ‌లు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీని మ‌డ‌త‌పెట్టి..' అనే సాంగ్  కు డాన్స్ చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. 
 

Virat Kohli-Anushka Dance to Kurchi Madathapetti Song from Super Star Mahesh Babu's Guntur Kaaram Movie RMA
Author
First Published Feb 8, 2024, 1:49 PM IST | Last Updated Feb 8, 2024, 2:41 PM IST

Kurchi Madathapetti Song - Virat Kohli dance: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీని మడ‌త‌పెట్టి.. ' సాంగ్ ఇంకా సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల్లో ఈ పాట‌కు రీల్స్, షార్ట్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే, ఇదే పాట‌కు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ, ఆయ‌న భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌లు డాన్స్ చేసిన వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీనికి కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది.

కానీ, ఈ వీడియో 'గుంటూరు కారం' చిత్రంలోని 'కుర్చీని మ‌డ‌త పెట్టి..' అనే సాంగ్ చేసిన డాన్స్ కాదు. ఇదే సాంగ్ కు క్రికెట‌ర్ కోహ్లీ భార్య‌ అనుష్క‌తో డాన్స్ చేసిన‌ట్టుగా ఎడిట్ చేసిన వీడియో ఇది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోను స్టార్ కపుల్ విరుష్కల అభిమానులు ఇలా ఎడిట్ చేసి సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. కోహ్లీ-అనుష్క‌ల డాన్స్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాలోని గుంటూరు కారం చిత్రంలోని 'కుర్చీని మ‌డ‌త ప‌ట్టి..' సాంగ్ కు స‌రిగ్గా సెట్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు.

రిష‌బ్ పంత్ వ‌చ్చేస్తున్నాడు.. ఫ్యాన్స్ మ‌స్తు ఖుషీ.. !

కాగా, పలుమార్లు అనుష్క శర్మతో పాటు భారత క్రికెటర్లతోనూ విరాట్ కోహ్లీ డాన్సు చేసి అదరగొట్టాడు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

 

టీమిండియాకు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వార్నింగ్.. బాజ్ బాల్ తో అన్నంత‌ప‌ని చేస్తారా..?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios