Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాకు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వార్నింగ్.. బాజ్ బాల్ తో అన్నంత‌ప‌ని చేస్తారా..?

India vs England: తొలి టెస్టులో ఊహించ‌ని విధంగా ఇంగ్లాండ్ చేతిలో ఓట‌మి చవిచూసిన భార‌త్ వైజాగ్ లో మెరిసింది. అయితే, మూడో టెస్టులో బాజ్ బాల్ వ్యూహింతో మ‌రింత దూకుడుగా ఆడుతామంటూ ఇంగ్లాండ్ కోచ్ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ భార‌త్ కు వార్నింగ్ ఇచ్చాడు. 
 

England coach Brendon McCullum warns team India.. Will they do that much with Bazball? RMA
Author
First Published Feb 8, 2024, 12:33 PM IST

India vs England - Brendon McCullum: భార‌త్-ఇంగ్లాండ్ టెస్టుకు ముందు 'బాజ్ బాల్' గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ‌ జ‌రిగింది. టెస్టు క్రిక‌ట్ లో త‌మ ధ‌నాధ‌న్ దూకుడు గేమ్ బాజ్ బాల్ వ్యూహంతో ఇంగ్లాండ్ టీమ్ టెస్టుల్లో సంచ‌ల‌న విజయాల‌ను న‌మోదుచేసింది. భార‌త ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బాట్ బాల్ వ్యూహంతో టీమిండియాను దెబ్బ‌కొట్టాల‌ని చూసింది. కానీ, వారనుకున్న విధంగా ఇక్క‌డ ఇంగ్లాండ్ వ్యూహం ఫ‌లించ‌లేదు. అయితే, అనూహ్యంగా హైద‌రాబాద్ లో జ‌రిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో భార‌త్ ఓడింది.

దూకుడు గేమ్ కు పేరుగాంచిన బాజ్ బాల్ వ్యూహాలతో భారత్ తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన బెన్ స్టోక్స్ సార‌థ్యంలోని ఇంగ్లాండ్ జట్టు.. 2వ టెస్టులో ఆతిథ్య జట్టుకు లొంగిపోయింది. 106 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ ను భార‌త్ చిత్తుచేసింది. ఇక మూడో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ భాత‌ర్ కు వార్నింగ్ ఇచ్చాడు. బాజ్ బాల్ వ్యూహంలో మరింత దూకుడు పెంచుతామ‌ని పేర్కొన్నాడు. సోమవారం విశాఖపట్నంలో జరిగిన 2వ టెస్టు అనంతరం విశ్రాంతి కోసం అబుదాబికి వెళ్లిన ఇంగ్లండ్ జట్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరిగే 3వ టెస్టుకు ముందు ఫిబ్రవరి 12న భారత్‌కు తిరిగి రానుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు అబుదాబిలో ఎలాంటి ప్రాక్టీస్ పాలుపంచుకోర‌ని స‌మాచారం.

భారత్‌కు బిగ్ షాక్.. 3, 4వ టెస్టు నుంచి విరాట్ కోహ్లీ ఔట్? ఫైనల్ మ్యాచ్‌ ఆడటమూ అనుమానమే !

బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ మాట్లాడుతూ.. “సిరీస్ ఇప్పుడు 1-1తో సమంగా ఉంది. కాబట్టి మేము ఇంకా పోటీలో ఉన్నామ‌నేది స్ప‌ష్టం. గత రెండు టెస్టుల్లో కూడా మేం బాగా ఆడాం. సిరీస్‌లో మరో 3 మ్యాచ్‌లు ఉన్నాయి. మా రన్ రేట్ మరింత పెరగవచ్చు... బాజ్ బాల్ వ్యూహాన్ని మ‌రింత‌గా అమ‌లు చేస్తాం" అని మెకల్లమ్ అన్నాడు. అయితే, బ్రెండ‌న్ మెక్ కల్లమ్- బెన్ స్టోక్స్ జట్టు బేస్ బాల్ వ్యూహంపై వ‌స్తున్న భిన్న స్పంద‌న‌ల‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ మాట్లాడుతూ.. బాజ్ బాల్ తీరుపై విమ‌ర్శ‌లు చేశారు. టెస్ట్ క్రికెట్‌లో కూడా ఓవర్‌కు 5 పరుగులు చేయడం వినోదభరితంగా ఉంటుంది కానీ, బ్యాట్స్‌మన్లు త్వ‌ర‌గా వికెట్లు కోల్పోయేలా చేస్తుందన్నారు. బాజ్ బాల్ కారణంగా జో రూట్ వికెట్లు కోల్పోతున్నాడు. అత‌ను ఇంకా టీ20 ప్ర‌పంచంలోనే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. దూకుడు ఆట కంటే ఇన్నింగ్స్‌ను ముగించడం చాలా ముఖ్యమని జెఫ్రీ బాయ్ కాట్ అన్నాడు.

రిష‌బ్ పంత్ వ‌చ్చేస్తున్నాడు.. ఫ్యాన్స్ మ‌స్తు ఖుషీ.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios