Asianet News TeluguAsianet News Telugu

ఇండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు.. భారత జట్టును నడిపించేది దాదానే..

India vs Rest Of The World: గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఇండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్  కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్ కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ  భారత సారథిగా వ్యవహరించనున్నాడు. 

BCCI chief Sourav Ganguly to lead, India vs Rest of the World game scheduled for September 16
Author
First Published Aug 12, 2022, 2:17 PM IST

టీ20లు,  ఫ్రాంచైజీ క్రికెట్‌లతో తగ్గాయిగానీ  గతంలో తరుచూ ఆడే ఇండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. వచ్చే నెల 16 న ఈ మ్యాచ్  జరుగనుంది. ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ మ్యాచ్ ను బీసీసీఐ నిర్వహించనున్నది.  భారత జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ  సారథిగా వ్యవహరించనుండగా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టుకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్  నాయకుడిగా ఉండనున్నాడు. 

వాస్తవానికి గత నెలలో కేంద్ర ప్రభుత్వం.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ మ్యాచ్ కార్యరూపం దాల్చేది కష్టమని బీసీసీఐ భావించింది. 

ఇండియాతో పాటు మిగతా అంతర్జాతీయ జట్లు కూడా వారి వారి ఇప్పటికే ఖరారైన ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ వివిధ బోర్డుల కోసం వెళ్లి ఒక్క మ్యాచ్ కోసం వాళ్లను ఒప్పించడం అనేది ఇప్పట్లో తేలే పని కాదని బీసీసీఐ భావించింది. అయితే రెగ్యులర్ ఆటగాళ్లతో కాకపోయినా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో తాజా మ్యాచ్ ఆడనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) ప్రారంభం కావడానికి  ఒక్కరోజు ముందే ఇండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది  వరల్డ్ మ్యాచ్ జరుగనుంది. 

 

భారత జట్టులో గంగూలీ తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్,   యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్,  హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలు ఆడనున్నారు. వీళ్లంతా గంగూలీ సారథ్యంలో భారత జట్టుకు ఆడినవారే కావడం విశేషం. 

జట్ల వివరాలు :

ఇండియా :  సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా (వికెట్ కీపర్), అశోక్ దిండా, ప్రజ్జాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగిందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి 

ఆస్ట్రేలియా : ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండి సిమన్స్, హెర్షెలీ గిబ్స్, జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్ (వికెట్ కీపర్),  నాథన్ మెక్ కల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హమిల్టన్ మసకద్జ, మష్రఫీ మొర్తజా, అస్గర్ అఫ్ఘాన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒబ్రెయిన్, దినేశ్ రామ్దిన్ (వికెట్ కీపర్) 

Follow Us:
Download App:
  • android
  • ios