Kuldeep Yadav: ఆసియా కప్ 2025లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు మాజీ లెగ్‌ స్పిన్నర్ అమిత్ మిశ్రా కీలక సలహా ఇచ్చారు. పరుగులతో సంబంధం లేకుండా వికెట్లు తీయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు.

DID YOU
KNOW
?
ఆసియా కప్ లో భారత్
ఆసియా కప్ ట్రోఫీ చివరిసారిగా భారత్ 2023లో గెలుచుకుంది. శ్రీలంకను ఫైనల్‌లో 10 వికెట్ల తేడాతో ఓడించి భారత్ 8వ సారి ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది.

Kuldeep Yadav: ఆసియా కప్ 2025లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మాజీ లెగ్‌ స్పిన్నర్ అమిత్ మిశ్రా మద్దతుగా నిలిచారు. అతనికి పలు సలహాలు కూడా ఇచ్చారు. "కుల్దీప్ ఒక వికెట్ టేకర్ బౌలర్. అతను ఎంత రన్స్ ఇస్తున్నాడో పట్టించుకోకుండా వికెట్లు తీయడంపై దృష్టి పెట్టాలి. తన సహజమైన బంతితోనే మ్యాచ్‌ను మార్చే సామర్థ్యం ఉంది" అని మిశ్రా అన్నారు. కుల్దీప్ తన ఫీల్డ్ సెట్టింగ్స్, బౌలింగ్ ప్రణాళికల గురించి కెప్టెన్, సహచరులతో చర్చిస్తే మరింత ఫలితం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కుల్దీప్‌ యాదవ్ రికార్డులు, ఐపీఎల్‌ ప్రదర్శనలు ఎలా ఉన్నాయి?

కుల్దీప్ ఇప్పటివరకు భారత్ తరఫున 40 T20I మ్యాచ్‌ల్లో ఆడి 69 వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ సగటు 14.07 కాగా, ఎకానమీ రేట్ 6.77. అదనంగా, ప్రతి 12.4 బంతులకు ఒక వికెట్ సాధించడం అతని ప్రత్యేకత. ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన కుల్దీప్ యాదవ్.. 14 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ గణాంకాలు అతని ప్రతిభను స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఆసియా కప్‌లో భారత జట్టు

భారత్ తన ఆసియా కప్ ప్రయాణాన్ని సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది. తర్వాత హై వోల్టేజ్ పోరు సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో దుబాయ్‌లో జరగనుంది. చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో తలపడుతుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నారు.


భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్. 

రిజర్వ్ ఆటగాళ్ళు: ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, యశస్వి జైస్వాల్.