- Home
- Sports
- Cricket
- Asia Cup 2025 : బ్యాటింగ్, బౌలింగ్ లో సూపర్ షో.. హాంకాంగ్ పై విక్టరీ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్
Asia Cup 2025 : బ్యాటింగ్, బౌలింగ్ లో సూపర్ షో.. హాంకాంగ్ పై విక్టరీ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్
Asia Cup 2025 AFG vs HKG : ఆసియా కప్ 2025 ను ఆఫ్ఘనిస్తాన్ తన ప్రయాణాన్ని భారీ గెలుపుతో ప్రారంభించింది. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హాంకాంగ్ బ్యాటింగ్ లో హయత్ మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.

ఆసియా కప్ 2025 తొలి పోరులో ఆఫ్ఘనిస్తాన్ దూకుడు
ఆసియా కప్ 2025 అబుదాబిలోని షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం ఘనంగా ఆరంభమైంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు హాంకాంగ్‌తో తలపడింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు.
మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు పవర్‌ప్లేలో పెద్ద షాక్‌లు తగిలాయి. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ (8) 25 పరుగులకే పెవిలియన్ చేరగా, మరో ఓపెనర్ ఇబ్రాహీం జాద్రాన్ (1) కూడా త్వరగానే ఔటయ్యాడు. 6 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 56/2గా ఉంది. ఈ సమయంలో సెదిఖుల్లా అటల్ (27), సీనియర్ ప్లేయర్ మహ్మద్ నబీ (18) జట్టు స్కోరును ముందుకు నడిపించారు.
సెదిఖుల్లా అటల్ హాఫ్ సెంచరీ నాక్
మిడిల్ ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ తన ఇన్నింగ్స్ ను కొంతవరకు చక్కదిద్దినప్పటికీ హాంకాంగ్ బౌలర్లు తరచూ వికెట్లు తీస్తూ ఒత్తిడి తీసుకొచ్చారు. 10 ఓవర్లలో స్కోరు 81/3గా ఉండగా, నబీ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అటల్ తన అర్ధసెంచరీను పూర్తి చేసి జట్టుకు బలమైన మద్దతుగా నిలిచాడు. 15 ఓవర్లలో స్కోరు 124/4కి చేరిన తర్వాత ఇన్నింగ్స్‌కు కొత్త ఊపు ఇస్తూ ఓమర్జాయ్ ధాటిగా ఆడాడు. అటల్ పక్కన నిలిచిన అతను బౌండరీలు, సిక్సులతో హాంకాంగ్ బౌలింగ్ ను చిత్తు చేశాడు.
హాంకాంగ్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన ఆఫ్ఘనిస్తాన్
చివరి ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. అటల్ స్థిరంగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మెరుగైన స్కోరు అందించగా, ఓమర్జాయ్ కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. అతని 53 పరుగుల ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్సులు ఉండటం విశేషం.
చివరికి 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ 189 పరుగులు చేసింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా, సెదిఖుల్లా అటల్–ఓమర్జాయ్ అద్భుత భాగస్వామ్యం జట్టును మంచి స్కోర్ దిశగా నడిపింది. దీంతో హాంకాంగ్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఉంచింది.
ఎక్కడా ప్రభావం చూపలేకపోయిన హాంకాంగ్
ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్‌లో 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు ఆరంభం నుంచే కుదేలైంది. కేవలం 3.2 ఓవర్లలోనే 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి, పవర్‌ప్లే ముగిసేసరికి 28/4తో తీవ్ర ఒత్తిడిలో పడింది. తరువాత కూడా పరిస్థితి మారకపోవడంతో 17వ ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయింది.
హాంకాంగ్ బ్యాటర్లలో బాబార్ హయాత్ 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో మ్యాచ్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. 20 ఓవర్లలో హాంకాంగ్ 94/9 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 94 పరుగుల తేడాతో గెలిచింది.
ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్ లోనే రికార్డుల మోత
పురుషుల ఆసియా కప్ T20Iలో అత్యధిక తేడాతో విజయాలు
• 155 పరుగులు – పాకిస్తాన్ vs హాంకాంగ్, షార్జా, 2022
• 101 పరుగులు – భారత్ vs ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్, 2022
• 94 పరుగులు – ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్, అబుదాబి, 2025
• 71 పరుగులు – యూఏఇ vs ఒమన్, మిర్పూర్, 2016
• 66 పరుగులు – ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్, మిర్పూర్, 2016
పురుషుల T20Iలో 2020 తర్వాత ఎక్కువ డ్రాప్ చేసిన క్యాచులు
• 8 – ఆస్ట్రేలియా vs స్కాట్లాండ్, గ్రాస్ ఇస్లెట్, 2024
• 8 – వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా, కింగ్స్టన్, 2025
• 8 – ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్, అబుదాబి, 2025
2024 నుంచి ఇప్పటివరకు హాంకాంగ్ జట్టు 34 రన్ అవుట్ డిస్మిసల్స్‌కు గురైంది.