బూస్టర్ డోసు అత్యవసరమేమీ కాదు - ఐసీఎంఆర్
బూస్టర్ డోసు వేసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ స్పందించింది. ఇప్పుడు బూస్టర్ డోసు వేసుకోవడం అత్యవసరేమీ కాదని తెలిపింది. రెండు డోసులతో మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పింది.
కరోనా ఓమ్రికాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఓమ్రికాన్ వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 57 దేశాలకు విస్తరించిందని తెలుస్తోంది. దీంతో భారత్ సహా అన్ని దేశాలు అలెర్ట్ అయ్యాయి. కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇప్పుడు ఇండియాలో కూడా ఓమ్రికాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అందరి దృష్టి బూస్టర్ డోసుపై పడింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొన్ని రోజుల తరువాత యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని వార్తలు వస్తుండటం, బూస్టర్ డోసు వేసుకుంటే కొత్త వేరియంట్ నుంచి రక్షణ లభిస్తుందని చెప్పడం వల్ల ఈ బూస్టర్ డోసు వేసుకోవాలనే డిమాండ్ దేశ ప్రజల్లో ఎక్కువవుతోంది.
బూస్టర్ డోసుపై పరిణామాలపై స్టడీ..
ఓమ్రికాన్ కేసులు పెరుగుతుండటం, డెల్లా వేరియంట్ కేసులు కూడా పెరుగుతుండటంతో ప్రజల్లో బూస్టర్ డోసు వేసుకోవాలనే చర్చలు జరుగుతున్నాయి. పలు వ్యాక్సిన్ కంపెనీలు కూడా తమ వ్యాక్సిన్ కొత్త వేరియంట్‌ను సమగ్రంగా ఎదుర్కొంటుందని చెబుతూ, తమ వ్యాక్సిన్ ను బూస్టర్ డోసుగా అనుమతించాలని కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఇదే విషయంలో ఐసీఎంఆర్ కొంత కాలంగా అధ్యయనం చేస్తోంది. బూస్టర్ డోసు వేసుకోవడం వల్ల మానవ శరీరంలో ఎదురయ్యే పరిణామాలు, శరీరక ఇబ్బందులు, ఆనారోగ్య సమస్యలు వంటి పలు అంశాలపై స్టడీ చేస్తోంది. ఈ నివేదిక ఇంకా రావాల్సి ఉంది.
తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ !
ఇప్పుడేం అర్జెంట్ లేదు..
బూస్టర్ డోసు వేసుకోవాల్సినంత అత్యవసర పరిస్థితులు ఇప్పుడు లేవని ఐసీఎంఆర్ తెలిపింది. రెండు డోసులు తీసుకున్న వారిలో కరోనా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పింది. ఈ మేరకు ఐసీఎంఆర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ డాక్టర్ సమీరన్ పాండా ఓ మీడియా సంస్థతో ఆదివారం మాట్లాడారు. బూస్టర్ డోసు ఎంత వరకు ఉపయోగం ఉంటుంది ? అది ఎవరికి ఇవ్వాలి ? ఎమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందా అనే విషయాలపై ఎం టగీ పరిశోధనలు చేస్తుందని చెప్పారు. దాని ఫలితాలు వచ్చాక బూస్టర్ డోసుపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఒక వేళ బూస్టర్ డోసు ఇవ్వాల్సి వస్తే రోగ నిరోదక శక్తి తక్కవగా ఉన్న వారికి, అలాగే వృద్దులకు ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, ఆ చర్చల తరువాత నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. కోవిషీల్డ్ మొదటికి, రెండో డోసుకు మధ్య వ్యవధి సరైనదే అని ఇప్పుడు దానిని కుదించాల్సిన అవసరం లేదని అన్నారు. రెండు డోసుల మధ్య సమయం తగ్గించాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయని, కానీ సమయం కుదించాల్సిన అవసరం లేదని తెలిపారు.
కోవిషీల్డ్ అప్లికేషన్ రిజెక్ట్...
బూస్టర్ డోసుగా కోవిషీల్డ్ ఇవ్వొచ్చని, దానికి అనుమతి ఇవ్వాలని గతంలో సీరం సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ దరఖాస్తును సీడీఎస్ఈవోకు చెందిన ఎస్ఈసీ తిరస్కరించింది. బూస్టరో డోసు ఫలితాలపై అధ్యయనం చేయాల్సి ఉందని, అది పూర్తికాకముందే అనుమతి ఎలా ఇస్తామని చెప్పింది. తమ వ్యాక్సిన్ కొత్త వేరియంట్లను తట్టుకుంటుందని, ప్రజలందరికీ బూస్టర్ డోసు ఇవ్వడానికి కావాల్సిన స్టాక్ మా వద్ద ఉందని చెబుతూ బూస్టర్ డోసుగా కోవిషీల్డ్ కు అనుమతి ఇవ్వాలని ఆ సంస్థ కోరింది.