వ్యాపారం చేయాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ గురించి తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అయితే భారతదేశంలో చిన్న వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? వ్యాపారం ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి.? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..  

మొదటిసారి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు ముందుగా ఈ అంశాలను గుర్తు పెట్టుకోవాలి: 

1) సరైన బిజినెస్ ఐడియా ఎలా ఎంపిక చేసుకోవాలి

2) వ్యాపారాన్ని ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోవాలి. 

3) అవసరమైన లైసెన్స్‌లు పొందాలి

4) మొదటి దశ నుంచి ప్రారంభించి పూర్తి స్థాయిలో ఎలా అభివృద్ధి చేయాలో అవగాహన ఉండాలి. 

చిన్న వ్యాపారం ప్రారంభిస్తే కలిగే లాభాలు ఇవే: 

1) ఆర్థిక స్వాతంత్రం:

మీ స్వంత వ్యాపారం వల్ల మీరు ఆదాయాన్ని నియంత్రించుకోవచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ను సాధించవచ్చు.

2) అభిరుచులు ఆధారంగా వృత్తి:

మీకు ఇష్టమైన పనిని బిజినెస్‌గా మార్చుకుని దానితో డబ్బు సంపాదించొచ్చు.

3) ఇంటి నుంచే ప్రారంభించొచ్చు:

వెంటనే భారీ పెట్టుబడి లేకుండా, ఇంటి నుంచే వ్యాపారం ప్రారంభించవచ్చు. వ్యయాలు తక్కువగా ఉండటంతో లాభం ఎక్కువగా మిగులుతుంది. తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టొచ్చు. 

4) మీరే బాస్:

మీరు తీసుకునే నిర్ణయాలు, వ్యవస్థాపించే విధానం అన్నీ మీ చేతిలోనే ఉంటాయి. ఎవరైనా ఆదేశించాల్సిన అవసరం లేదు. సొంత కాళ్లపై నిలబడాలనుకునే వారికి ఇదే బెస్ట్‌ ఆప్షన్‌. 

5) MSME ప్రోత్సాహాలు:

చిన్న వ్యాపారాల కోసం ప్రభుత్వం అందించే స్కీములు, సబ్సిడీలు, లోన్లు మొదలైనవన్నీ MSME కింద పొందవచ్చు.

6) స్వేచ్ఛ:

కొత్త ఐడియాలు, ప్రొడక్ట్స్, సర్వీసులు మార్కెట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇది మీ బిజినెస్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది.

7) వర్క్-లైఫ్ బ్యాలెన్స్

మీ పని సమయాన్ని మీరే డిజైన్ చేసుకోవచ్చు. వృత్తి, వ్యక్తిగత జీవితం రెండింటికీ సమతుల్యత కాపాడుకోవచ్చు.

8) స్వయంప్రతిపత్తి:

స్వంత బిజినెస్ వల్ల మీరు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీ జీవితాన్ని మీరు నిర్మించుకునే అవకాశం దొరుకుతుంది.

9) ప్రత్యేక మార్కెట్‌కి చేరుకోవచ్చు:

చిన్న వ్యాపారంతో మార్కెట్లను టార్గెట్ చేసి ప్రత్యేకమైన కస్టమర్లకు విలువైన సేవలు ఇవ్వొచ్చు.

వ్యాపారం ప్రారంభించే ముందు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు: 


1) విజన్, మిషన్ స్పష్టంగా ఉండాలి:

వ్యాపారం ద్వారా మీరు ఎలాంటి లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోవాలి. భవిష్యత్తులో మీ వ్యాపారం ఎలా ఉండాలనే దానిపై ఒక క్లారిటీ ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారన్న ఆలోచన ఉండాలి. ఈ రెండు స్పష్టంగా ఉంటే వ్యాపారం అభివృద్ధి దిశలో బలంగా ముందుకెళ్తుంది.

2) టార్గెట్ కస్టమర్లపై రీసెర్చ్ చేయండి:

మీరు అమ్మబోయే ఉత్పత్తులు లేదా సేవలు ఎవరి కోసం? వాళ్లు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు? వీటిపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. మార్కెట్ ట్రెండ్స్, కస్టమర్ బిహేవియర్ విశ్లేషణ వల్ల, మీ ఆఫర్‌ చేసిన ప్రొడక్ట్స్‌కి మంచి స్పందన వస్తుంది. 

3) ఫైనాన్షియల్ ప్లానింగ్, క్యాష్ ఫ్లోపై దృష్టి పెట్టండి:

వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ఎక్కడినుంచి వస్తుంది? మీరు సేవింగ్స్‌ ఉపయోగించబోతున్నారా? లేదా లోన్ తీసుకుంటారా? మరెవరైనా ఇన్వెస్ట్ చేయనున్నారా? ఇలా ముందే ఆలోచించి బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. ట్యాక్స్‌కు డబ్బు వదిలివేయాలి. ఎప్పుడైనా డబ్బు కొరత వస్తే దానికోసం ముందుగానే ప్లాన్‌ చేయాలి.

4) బిజినెస్ మోడల్‌ను రూపొందించండి

మీరు డబ్బు ఎలా సంపాదించబోతున్నారు? ఎలాంటి ప్రొడక్ట్స్ / సర్వీసులు ఇవ్వబోతున్నారు? వాటికి ధర ఎలా నిర్ణయించబోతున్నారు? ఎంత టైంలో లాభాల్లోకి వచ్చేస్తుంది?
ఇవన్నీ కలిపే వ్యూహమే బిజినెస్ మోడల్. ఇది క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలి. 

5) బలమైన టీమ్ తయారు చేసుకోవాలి: 

వ్యాపారం ప్రారంభించాలంటే బలమైన టీమ్‌ ఉండేలా చూసుకోవాలి. అనుభవం ఉన్నవారిని తీసుకోవాలి. అది ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడానికే కాకుండా, సమస్యలను పరిష్కరించడంలోనూ సహాయపడుతుంది. 

6) పొటెన్షియల్ రిస్క్స్‌ను అంచనా వేయండి:

ప్రతి వ్యాపారానికీ కొన్ని ప్రమాదాలు ఉంటాయి. లీగల్ ఇష్యూలు, ఫైనాన్షియల్ మార్పులు, పోటీ. వీటన్నింటినీ ముందుగానే గుర్తించి, ఎలాంటి పరిస్థితికికైనా సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఏదైనా అకస్మాత్తుగా జరిగినా తట్టుకోగలుగుతారు.

వ్యాపారం ప్రారంభించే ముందు ఈ చిట్కాలు పాటించండి: 

వ్యాపారం ప్రారంభించాలంటే కొంత ప్లానింగ్, పట్టుదల, సరైన దిశలో ప్రయత్నాలు అవసరం. ఇవి మీ బిజినెస్‌ను విజయవంతంగా ప్రారంభించడంలో సహాయపడతాయి:

1) క్లియర్ బిజినెస్ ఐడియా పెట్టుకోండి:

మీ అభిరుచులు, మార్కెట్ అవసరాలకి సరిపడే వ్యాపార ఆలోచనను ఎంచుకోండి. టార్గెట్ కస్టమర్స్ ఎవరు? పోటీదారులు ఎవరున్నారు? అనే విషయాల్లో రీసెర్చ్ చేయండి.
మీ ఐడియాకి మార్కెట్‌లో డిమాండ్ ఉందో లేదో ముందుగా తెలుసుకోండి. 

2) డిటైల్డ్ బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోండి:

మీ వ్యాపారం ఎలా నడవాలి, లక్ష్యాలు ఏంటి, మార్కెటింగ్ ఎలా చేయాలి, డబ్బు ఎలా వస్తుంది, రోజూ ఎలా ఆపరేట్ చేయాలి అనే విషయాలపై క్లియర్ ప్లాన్ ఉండాలి.

3) సరైన బిజినెస్ స్ట్రక్చర్ ఎంచుకోండి:

మీ అవసరాలను బట్టి సరైన రిజిస్ట్రేషన్ రకాన్ని ఎంచుకోండి: 

సొంత వ్యాపారం (Sole Proprietorship)

భాగస్వామ్య వ్యాపారం (Partnership)

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ

ఇది మీ టాక్స్, లాయబిలిటీ, ఆపరేషన్స్ మీద ప్రభావం చూపుతుంది.

4) లీగల్, టాక్స్ అవసరాలు తెలుసుకోండి:

మీ వ్యాపారం ప్రభుత్వంతో రిజిస్టర్ చేయించండి. అవసరమైన లైసెన్సులు (GST, FSSAI వంటివి) తీసుకోండి. టాక్స్ లా ప్రకారం అన్ని రూల్స్‌ను పాటించండి, తద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

5) ఫండింగ్ కోసం ముందుగా ప్లాన్ చేయండి:

వ్యాపారం నడిపేందుకు ఎంత డబ్బు అవసరమో అంచనా వేసుకోండి. సొంత సేవింగ్స్, లోన్లు, ఇన్వెస్టర్లు లేదా క్రౌడ్‌ఫండింగ్ వంటి ఆప్షన్స్‌ను పరిశీలించండి.

6) డిజిటల్ ప్రెజెన్స్‌ను పెంచుకోండి:

ఈ రోజుల్లో వ్యాపారాన్ని ప్రమోట్ చేయాలంటే వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ తప్పనిసరి. మీ ప్రొడక్ట్స్ లేదా సర్వీసులు గురించి ఆన్‌లైన్‌లో చెప్పండి, కస్టమర్లతో కంటాక్ట్‌లో ఉండండి.

7) మార్కెటింగ్, సెల్స్‌పై దృష్టి పెట్టండి:

టార్గెట్ కస్టమర్లను ఎలా చేరుకోవాలో క్లియర్‌గా ప్లాన్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాను ఉపయోగించండి.

8) సమస్యలు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి:

వ్యాపారం ప్రారంభించడమంటే సులువు కాదు. కొన్ని సమస్యలు, తప్పులు తప్పవు. వాటి నుంచి నేర్చుకోవాలి, ఫెయిల్యూర్‌కు భయపడకుండా ముందుకెళ్లాలి.

9) బలమైన మద్దతు ఉన్నవారితో ఉండండి:

మెంటర్, బిజినెస్ పార్ట్‌నర్, లేదా నమ్మకమైన ఉద్యోగులు ఉంటే వ్యాపారం బాగా ఎదుగుతుంది. వాళ్ల సలహాలు, సహకారం వల్ల మీరు ఎక్కువ నమ్మకంగా పనిచేయగలుగుతారు.

10) ఓపికతో ఉండండి:

విజయం ఒక రాత్రిలో రాదు. నిరంతరం కష్టపడాలి, లక్ష్యాలపై ఫోకస్ ఉండాలి. ఒక్కో దశగా ఎదుగుతూ, మీ వ్యాపారాన్ని స్థిరంగా తీర్చిదిద్దాలి. 

ప్రభుత్వ రుణాలు: 

భారతదేశంలో చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చాలా రకాల రుణ పథకాలను అందిస్తోంది. ఇవి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ఈఎమ్‌ఐల ద్వారా చెల్లించవచ్చు. మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 

1) ప్రధాన్ మంత్రీ ముద్రా యోజన (PMMY):

ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఇది చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి కలిగిన వ్యక్తుల కోసం ఉపయోగపడతాయి. ఇవి మొత్తం మూడు రకాలు ఉంటాయి. 

శిశు: రూ. ₹50,000 వరకు

కిశోర్: ₹50,000 నుంచి ₹5 లక్షల వరకు

తరుణ్: ₹5 లక్షల నుంచి ₹10 లక్షల వరకు

ఈ మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్‌, మిషనరీ కొనుగోలు కోసం వాడుకోవచ్చు.

2) స్టాండ్-అప్ ఇండియా స్కీమ్

ఈ పథకం ద్వారా ప్రతి బ్యాంక్ బ్రాంచ్ నుంచి కనీసం ఒక మహిళా ఎంట్రప్రెనర్, ఒక SC/ST ఎంట్రప్రెనర్‌కు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణం లభిస్తుంది. ఈ పథకం మాన్యుఫాక్చరింగ్, సర్వీసులు, ట్రేడింగ్ రంగాల కొత్త వ్యాపారాలకు ఉపయోగపడుతుంది. 

3) ప్రధాన్ మంత్రీ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం:

ఈ పథకం ద్వారా కొత్త మైక్రో వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందుతుంది.

సర్వీసుల వ్యాపారాలకు: ₹10 లక్షల వరకు

మాన్యుఫాక్చరింగ్ యూనిట్లకు: ₹25 లక్షల వరకు

సబ్సిడీ: సాధారణ వర్గానికి 35%, SC/ST/OBC/మైనారిటీ వారికి 50% వరకు లభిస్తుంది.

4) క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్:

ఈ పథకం ద్వారా ష్యూరిటీ లేకుండా రూ. 2 కోట్ల వరకు లోన్‌ పొందొచ్చు. బ్యాంకులు రిస్క్ లేకుండా రుణం ఇచ్చేలా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.

5) NSIC రుణాలు, సబ్సిడీలు (నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్):

NSIC ద్వారా చిన్న పరిశ్రమలకు రా మెటీరియల్, మిషనరీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలుకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇది ప్రభుత్వ టెండర్లకు యాక్సెస్ కూడా ఇస్తుంది.

6) మేక్ ఇన్ ఇండియా పథకం:

మేక్ ఇన్ ఇండియాపథకం మాన్యుఫాక్చరింగ్ రంగంలో వ్యాపారాలను ప్రోత్సహించేందుకు రుణాలు, సబ్సిడీలు అందిస్తుంది. భారతదేశాన్ని మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. 

7) బాంక్ ఆఫ్ బరోడా MSME రుణ పథకం:

MSMEలకు తక్కువ వడ్డీ రేటుతో, సులభమైన రీపేమెంట్ షరతులతో బాంక్ ఆఫ్ బరోడా రుణం ఇస్తోంది. ఈ రుణాన్ని వర్కింగ్ కాపిటల్, బిజినెస్ విస్తరణ, మిషనరీ కొనుగోలుకు వాడుకోవచ్చు.

8) SIDBI రుణాలు (సిడ్బీ – స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా):

SIDBI ద్వారా చిన్న వ్యాపారాలకు టర్మ్ లోన్స్, వర్కింగ్ కాపిటల్, మైక్రో ఫైనాన్స్ లభించవచ్చు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కొన్ని ప్రత్యేక రంగాల కోసం ప్రత్యేక పథకాలూ ఉన్నాయి.

9) రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక పథకాలు:

కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక రుణ పథకాలు, సబ్సిడీలు ఇస్తున్నాయి. ప్రత్యేకంగా మహిళా, యువ ఎంట్రప్రెనర్స్ కోసం ఈ పథకాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి.

ఇది కూడా చదవండి: మీలో పట్టుదల ఉంటే చాలు రూ.15,000లతో ఈ బిజినెస్ లు స్టార్ట్ చేసి సక్సెస్ కావొచ్చు

భారత్‌లో వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? 

భారతదేశంలో చిన్న వ్యాపారం ప్రారంభించాలంటే కొన్ని ముఖ్యమైన దశలను పాటించాలి. వీటివల్ల మీరు చట్టపరమైన అనుమతులు పొందడంతో పాటు, వ్యాపారాన్ని విజయవంతంగా నడిపేందుకు బలమైన పునాది వేయొచ్చు. 

1) బిజినెస్‌ ఐడియాను ఎంచుకోండి: 

ముందుగా మీకు ఆసక్తి ఉండే, మార్కెట్‌లో అవసరం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకోవాలి. మీ ఐడియా ప్రత్యేకంగా ఉండాలి. ఇందుకోసం మార్కెట్‌లో ఉన్న పోటీదారులను, పరిశ్రమను పరిశీలించండి.

2) మార్కెట్ రీసర్చ్ చేయండి:

మీ వ్యాపారానికి సంబంధించి టార్గెట్ కస్టమర్లు ఎవరు, వారు ఏం కోరుకుంటున్నారు, పోటీ ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకోండి. దీనివల్ల వ్యాపారం చేయదగినదేనా అనే స్పష్టత వస్తుంది.

3) బిజినెస్ ప్లాన్ తయారుచేయండి:

మీ వ్యాపార లక్ష్యాలు, మార్కెటింగ్ ప్లాన్, డబ్బు అవసరాలు, పని విధానం వంటి విషయాలను స్పష్టంగా ప్రణాళిక రూపంలో తయారు చేయండి. ఇది మీకు నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడుతుంది. 

4) టార్గెట్ మార్కెట్‌ను గుర్తించండి:

మీ కస్టమర్లు ఎవరు? వారి వయస్సు, అవసరాలు, ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా, మీ ఉత్పత్తులు, సేవలు వారికి అనుకూలంగా ఉండేలా రూపొందించొచ్చు.

5) పెట్టుబడి సేకరించండి:

వ్యూహాత్మకంగా డబ్బు అవసరాన్ని అంచనా వేసి, దానికి అనుగుణంగా పెట్టుబడి సేకరించండి. స్వంత సేవింగ్స్, రుణాలు, ఇన్వెస్టర్లు లేదా క్రౌడ్‌ఫండింగ్ వంటి మార్గాలు చూడొచ్చు.

6) వ్యాపార వ్యూహం రూపొందించండి:

మీరు పోటీదారుల కంటే ఎలా భిన్నంగా ఉంటారు? ఎలా కస్టమర్లను ఆకర్షిస్తారు? ఇలాంటి అంశాలపై స్పష్టమైన వ్యూహం ఉండాలి.

7) వ్యాపారానికి సరైన పేరు ఎంచుకోండి:

సులభంగా గుర్తుపట్టదగిన, మీ వ్యాపార లక్ష్యాలను ప్రతిబింబించే పేరును ఎంచుకోండి. బ్రాండ్ గుర్తింపు కోసం ఇది చాలా ముఖ్యమైనది.

8) వ్యాపార రూపాన్ని నిర్ణయించండి: 

సోల్ ప్రొప్రైటర్‌షిప్: ఒక వ్యక్తి చేపట్టే వ్యాపారం

పార్ట్‌నర్‌షిప్: ఇద్దరు లేదా ఎక్కువ మంది కలిసి

ఎల్‌ఎల్‌పీ (LLP): పరిమిత బాధ్యతతో భాగస్వామ్యం

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ: కంపెనీగా నమోదు చేసుకునే సంస్థ

ఒకే వ్యక్తి కంపెనీ (OPC): ఒక్కడే స్టార్టప్ ప్రారంభించదలచుకున్నప్పుడు ఉపయోగపడుతుంది

9) వ్యాపారాన్ని నమోదు చేయండి: 

మీ వ్యాపార రూపం ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించాలి:

RoC (Registrar of Companies): కంపెనీలకు

PAN & TAN: పన్నుల కోసం

Shop & Establishment Act: ఫిజికల్ స్టోర్ లేదా ఆఫీస్ ఉంటే

10) బిజినెస్ బ్యాంక్ ఖాతా తెరవండి:

వ్యక్తిగత ఖర్చులు, వ్యాపార ఖర్చులను వేరుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా బిజినెస్ ఖాతా అవసరం.

11) అవసరమైన లైసెన్సులు, అనుమతులు తీసుకోండి:

మీ వ్యాపారం ఏ రంగానికి సంబంధించినదో అనుసరించి అవసరమైనవి పొందాలి:

GST రిజిస్ట్రేషన్

ట్రేడ్ లైసెన్స్

ప్రొఫెషనల్ ట్యాక్స్ లైసెన్స్ (కొన్ని రాష్ట్రాల్లో)

FSSAI లైసెన్స్ (ఆహార ఉత్పత్తులు/సరఫరా ఉంటే)

IEC కోడ్ (ఇంపోర్ట్/ఎక్స్‌పోర్ట్ చేస్తే)

12) పన్నుల సమాచారం తెలుసుకోండి:

GST, ఇన్కమ్ ట్యాక్స్, రాష్ట్ర పన్నులు ఎలా ఉంటాయో తెలుసుకుని, వాటికి అనుగుణంగా టైమ్‌పై ఫైలింగ్స్ చేయాలి.

13) అకౌంటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయండి:

ఖర్చులు, ఆదాయం, ఉద్యోగుల వేతనాల లెక్కలు నిపుణుల సాయం తీసుకుని నిర్వహించాలి. అవసరమైతే అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ వాడండి.

14) ఆన్‌లైన్ ప్రెజెన్స్ ఏర్పరచండి:

వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్లను ఆకర్షించండి.

15) ఫండింగ్ కోసం ఎంపికలు చూడండి:

బ్యాంకు రుణాలు

ప్రభుత్వ గ్రాంట్లు

ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటల్

16) వ్యాపారం ప్రారంభించండి:

సిబ్బంది నియామకం, మార్కెటింగ్ ప్లాన్ అమలు చేసి, కస్టమర్లకు మంచి సేవలతో మొదలు పెట్టండి.

17) చట్టబద్ధంగా కొనసాగించండి:

వార్షిక ఫైలింగ్స్

లైసెన్స్ రిన్యూల్స్

పన్నుల చెల్లింపులు తప్పకుండా నిర్వహించాలి

ఇది కూడా చదవండి: Business Idea: రూ. 50వేల పెట్టుబడితో రోజుకు వెయ్యి రూపాయల ఆదాయం.. గేమ్‌ ఛేంజర్‌ బిజినెస్‌

పెట్టుబడులు ఎలా పొందాలి.? 

1) స్వంత పొదుపు (Personal Savings):

మీ సొంత డబ్బుతో వ్యాపారం మొదలుపెడితే ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రుణం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉండదు.

2) ఫ్రెండ్స్ & ఫ్యామిలీ (Friends and Family):

మీ బంధువులు, స్నేహితుల నుంచి డబ్బు తీసుకోవచ్చు. ఇది రుణంగా తీసుకుంటున్నారా, లేక తిరిగి చెల్లిస్తామని తీసుకుంటున్నారా.? అన్న దానిపై స్పష్టత ఉండాలి. 

3) బ్యాంక్ లోన్లు (Bank Loans)

బ్యాంకుల నుంచి చిన్న వ్యాపార రుణాలు తీసుకోవచ్చు. భారతదేశంలో ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY) వంటి ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి.

4) క్రౌడ్‌ఫండింగ్ (Crowdfunding)

మీ వ్యాపార ఐడియాను Kickstarter, Indiegogo వంటి వెబ్‌సైట్లలో పెట్టి, ప్రజల నుంచి నిధులు సేకరించవచ్చు.

5) ఐన్జెల్ ఇన్వెస్టర్లు & వెంచర్ క్యాపిటలిస్టులు:

మీ వ్యాపారానికి వృద్ధి అవకాశాలు ఉంటే, డబ్బు పెట్టే పెట్టుబడిదారులను (ఇన్వెస్టర్లు) సంప్రదించి, వాటాల రూపంలో పెట్టుబడి తీసుకోవచ్చు.

6) మైక్రోఫైనాన్స్ & P2P లెండింగ్: 

Faircent వంటి పీర్-టు-పీర్ ప్లాట్‌ఫారాలు లేదా చిన్న మొత్తాల్లో రుణాలు ఇచ్చే మైక్రోఫైనాన్స్ సంస్థల నుంచి డబ్బు పొందవచ్చు.

7) ప్రభుత్వ పథకాలు & గ్రాంట్లు

Startup India, Stand-Up India వంటి పథకాల ద్వారా డబ్బు, ట్రైనింగ్, మెంటారింగ్ పొందవచ్చు.

8) బూట్‌స్ట్రాపింగ్ (Bootstrapping)

మీరు ఇతర పనుల (ఫ్రీలాన్స్, పార్ట్‌టైమ్) ద్వారా వచ్చే ఆదాయాన్ని వ్యాపారానికి వినియోగించవచ్చు.

9) ట్రేడ్ క్రెడిట్ (Trade Credit)

సరఫరాదారులతో చర్చించి, సరుకులకు ఆలస్యంగా చెల్లించే అవకాశం కోరండి. దీంతో తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టవచ్చు.

ఇది కూడా చదవండి: బంగారం ధర ఎంత పెరిగితే అంత లాభం.. ఈ బిజినెస్‌తో లక్షాధికారి కావడం ఖాయం

డబ్బులు లేకుండా వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? 

1) మీ దగ్గర ఉన్న నైపుణ్యాలపై ఆధారపడండి:

ఫ్రీలాన్స్ పని (content writing, graphic design, translation)

ఆన్‌లైన్ ట్యూషన్లు

హస్తకళల ఉత్పత్తులు

కన్సల్టెన్సీ సేవలు

ఇవి స్టార్ట్ చేయడానికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు.

2) ఉచిత టూల్స్ ఉపయోగించండి:

వెబ్‌సైట్ కోసం: Wix, WordPress

లోగో డిజైన్ కోసం: Canva

ప్రచారం కోసం: Facebook, Instagram, WhatsApp, Telegram వంటివి ఉపయోగించండి

3) ఇంటినుండే పని చేయండి: 

ఇలా చేస్తే అద్దె ఖర్చులు, రవాణా ఖర్చులు ఉండవు.

4) ఇతరుల సేవలతో పంచుకోండి: 

మీ వద్ద ఉన్న సేవలను, ఇతరుల సేవలతో మార్చుకోండి. ఉదాహరణకు: మీరు ఒకరికి వెబ్‌సైట్ చేస్తే, వారు మీకు మార్కెటింగ్ సహాయం చేయొచ్చు.

5) క్రౌడ్‌ఫండింగ్ & చిన్న రుణాలు:

మీ వ్యాపార ఐడియాను ప్రజలతో పంచుకుని చిన్న మొత్తంలో డబ్బు సేకరించండి (Kickstarter, Milaap లాంటి సైట్‌ల ద్వారా). లేదా ప్రధాన్ మంత్రి ముద్ర యోజన వంటి ప్రభుత్వ పథకాల ద్వారా మైక్రో లోన్ పొందండి.

6) చిన్నగా మొదలు పెట్టండి – కొద్దిగా ఆదాయం వచ్చాక మళ్ళీ పెట్టుబడి పెట్టండి: 

ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగించండి. పోర్ట్‌ఫోలియో తయారు చేసుకోండి. ఆ డబ్బుతో నెమ్మదిగా వ్యాపారాన్ని పెంచుకోండి. 

గమనిక: వీటన్నింటితో పాటు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఉంటే ముందుగా ఆ రంగంలో విజయాన్ని సాధించిన వారిని నేరుగా వెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవడం మంచిది. దీని ద్వారా లాభనష్టాలను మరింత మెరుగ్గా అంచనా వేయొచ్చు.