- Home
- Business
- OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
OYO Meaning: యువతలో ఎక్కువ వినిపించే పదం ఓయో. ఎక్కడ ఉన్నా కూడా కావాల్సిన నగరంలో ఓయో రూమ్ బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఓయో సంస్థను నిలబెట్టింది యువతేనని గణాంకాలు కూడా చెబుతున్నాయి. అసలు ఓయో అంటే ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా?

ఓయో అంటే ఏమిటి?
మనదేశంలో ప్రయాణికుల కోసం సరసమైన ధరలో శుభ్రమైన గదులు పొందేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఓయో. 19 ఏళ్ల వయసులో రితేష్ అగర్వాల్ అనే యువకుడు ప్రారంభించిన ఈ స్టార్టప్ ఇప్పుడు 50 దేశాల్లో సక్సెస్ అయింది. OYO అంటే On Your Own అని అర్థం. అంటే ప్రయాణికులకు తమకు నచ్చిన చోట, తమ బడ్జెట్‌కి సరిపోయే రూమ్‌ను తమకు తామే తేలికగా బుక్ చేసుకునే వీలును కల్పించడం అని అర్థం. ఓయో గదులు మొదట చిన్న స్థాయిలో ప్రారంభమైనా, కొన్నేళ్లలోనే దేశవ్యాప్తంగా, తరువాత ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించాయి. ప్రయాణికులు ఎక్కడ ఉన్నా, ఒకే తరహా సౌకర్యాలు, క్లీన్ బెడ్‌షీట్లు, వైఫై, టీవీ, సేఫ్ చెక్-ఇన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండటం ఓయో ప్రజాదరణను పెంచేసింది.
యువతే కీలకం
ఓయోను ప్రత్యేకంగా నిలబెట్టిన విషయం అది వాడే టెక్నాలజీ. సాధారణంగా హోటల్ బుకింగ్ అంటే కౌంటర్‌కి వెళ్లి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఓయోలో అన్నీ యాప్‌లోనే పూర్తవుతాయి. ఏ ప్రాంతంలో ఎంత డిమాండ్ ఉందో, ఏ గదులు ఖాళీగా ఉన్నాయో, దాన్ని బట్టి ధరలు కూడా మారిపోతూ ఉంటాయి. అంతేకాదు ఓయోలో గది ఖాళీ అయిన వెంటనే క్లీన్ పాస ప్రక్రియ చేపడతారు. ముఖ్యంగా ఓయోను సక్సెస్ చేసింది యువతేనని చెప్పుకోవాలి. తమ స్నేహతులతో గడిపేందుకు ఎక్కువగా వారు ఓయో గదులను వాడడం మొదలుపెట్టారు. ఇప్పటికీ పుట్టినరోజులు, ప్రైవేటు పార్టీల కోసం నలుగురైదుగురు స్నేహితులు ఓయో గదులకే వెళుతున్నారు. కొన్ని ప్రీమియం ఓయో గదులకు మొబైల్ ద్వారా డోర్ ఓపెన్ చేసే స్మార్ట్ లాక్స్, ఆటోమేటెడ్ చెక్-ఇన్ కియోస్క్‌లు, స్మార్ట్ లైటింగ్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.
జంటల కోసం రిలేషన్ షిప్ మోడ్
ఇక యువత ఎక్కువగా ఉపయోగించేది రిలేషన్‌షిప్ మోడ్ సౌకర్యం.ఈ ఆప్షన్ ద్వారా జంటలు చట్టపరంగా, భద్రతగా చెక్ ఇన్ అనుమతించే ప్రాపర్టీలను ముందుగానే తెలుసుకుని బుక్ చేసుకోవచ్చు. ఈ పారదర్శకత వల్ల అనవసర ఇబ్బందులు తగ్గాయి. వీకెండ్లు, సెలవుదినాలు, పరీక్షలు లేదా ఇంటర్వ్యూల కోసం ప్రయాణించే విద్యార్థులు కూడా ఓయో గదులను బాగా వాడతారు. వెంటనే బుకింగ్, సులభ క్యాన్సిలేషన్, ఆఫర్లు వంటి కారణాల వల్ల ఓయో సక్సెస్ అయిపోయింది. ఓయో క్యాప్టెన్ అనే ప్రత్యేక సేవ ఉండే ప్రాంతాల్లో కస్టమర్లు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. అక్కడ ఒక మేనేజర్ ఉండి సమస్యలు పరిష్కరిస్తాడు.
ఎన్ని దేశాల్లో?
ఇప్పటి వరకు 50కిపైగా దేశాలు, 10,000కిపైగా నగరాల్లో సేవలు అందిస్తున్న ఈ కంపెనీ ప్రపంచంలోని వేగంగా పెరుగుతున్న హోటల్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచింది. బడ్జెట్ ట్రావెల్ పెరగడం, ఆన్‌లైన్ బుకింగ్‌ల సదుపాయం ఉండడం, స్మార్ట్‌ఫోన్ వినియోగం వంటి కారణాల వల్ల ఓయోకు భారీ ఆదరణ లభించింది. ఓయో గదులను భారతీయ ప్రయాణికుల కోసం అత్యంత నమ్మకమైనవిగా మారాయి.

