MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మీలో పట్టుదల ఉంటే చాలు రూ.15,000లతో ఈ బిజినెస్ లు స్టార్ట్ చేసి సక్సెస్ కావొచ్చు

మీలో పట్టుదల ఉంటే చాలు రూ.15,000లతో ఈ బిజినెస్ లు స్టార్ట్ చేసి సక్సెస్ కావొచ్చు

Low Investment Business Ideas: అదానీ, అంబానీలు ఏ వ్యాపారం చేసినా ఎందుకు సక్సెస్ అవుతున్నారు. పట్టుదల, కష్టపడేతత్వం, తెలివితేటలు ఇలా ప్రతీది 100 శాతం ఉపయోగిస్తారు కాబట్టి. మీకు కూడా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలన్న పట్టుదల ఉంటే కేవలం రూ.15,000 చాలు. ఇక్కడ చెప్పిన ఏ బిజినెస్ లో అయినా కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆ వ్యాపారాలు ఏంటో చూద్దాం రండి.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 04 2025, 07:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇప్పుడు స్టార్టప్ బిజినెస్‌లపై చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలామంది రిస్క్ తీసుకుని కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. కొందరు ఉద్యోగంతో పాటు ఎక్స్‌ట్రా ఆదాయం పొందాలని బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ ప్యాషన్, టాలెంట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తే మీరు ఏ బిజినెస్ లో సక్సెస్ సాధించగలరో మీకు తెలుస్తుంది. బిజినెస్‌లో దిగే ముందు మార్కెట్ అనాలిసిస్ చేయడం చాలా ముఖ్యం.

25

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రోడక్ట్‌కి డిమాండ్ ఉంది, ఎలాంటి సర్వీస్ కస్టమర్స్ కోరుకుంటున్నారు? తదితర విషయాలపై అవగాహన పెంచుకొని వ్యాపారంలోకి దిగడం మంచిది. మీకు క్లారిటీ ఉంటే తక్కువ డబ్బుతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీ దగ్గర జస్ట్ 15 వేలు ఉంటే చాలు. షాప్ లేదా స్టోర్ ఏమీ అవసరం లేకుండానే వ్యాపారం చేయొచ్చు. అలాంటి బెస్ట్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. 

మార్కెట్‌లో ఊరగాయలు, అప్పడాలకి కూడా డిమాండ్ ఉంది. కేవలం 15 వేల రూపాయలతో ఈ బిజినెస్ లు స్టార్ట్ చేయొచ్చు.

స్మార్ట్‌ఫోన్ రిపేరింగ్ కూడా ఆన్ లైన్ లో చేయొచ్చు. ఆర్డర్స్ తీసుకొని వారి ఇంటికి వెళ్లి రిపేర్ చేయొచ్చు. దీనికి ముందుగా మీరు సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకొని ఉండాలి. 

35

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా మీషో లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌ని షాప్‌లా యూజ్ చేసి ప్రోడక్ట్స్ అమ్మడం స్టార్ట్ చేయొచ్చు. వాళ్ల ప్రోడక్ట్స్ ని మీరు ప్రచారం చేసి మీకు తెలుసున్న వారికి అమ్మొచ్చు. మీకు స్కిల్ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ కూడా అవసరం లేదు. ముందుగా ఆర్డర్ తీసుకొని వారి డబ్బుతోనే కొని వారికి డెలివరీ చేయొచ్చు. లేదా ముందుగా కొన్ని ఐటమ్స్ మీరు కొని మీ దగ్గర పెట్టుకొని వాటిని ప్రచారం చేసి కేవలం గంటలు లేదా తక్కువ రోజుల్లోనే డెలివరీ చేసి మీ కస్టమర్ల వద్ద మార్కులు కొట్టేయండి. దీంతో మీ వ్యాపారం వేగంగా డవలప్ అవుతుంది. 

45

ఫ్రీలాన్సింగ్

ఫ్రీలాన్సింగ్ కూడా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారమే. మీరు ఎంచుకున్న రంగంలో దేనికైనా డిమాండ్ ఉందో దాన్ని మీరు ముందుగానే సిద్దం చేసుకొని పెట్టుకోండి. ఉదాహరణకు కంటెంట్ రైటింగ్, మూవీ స్టోరీస్, షార్ట్ స్టోరీస్, స్టోరీ ఐడియాస్ ఇలా మీ దగ్గర ముందుగా సిద్ధంగా ఉంటే అవి నచ్చిన వారు వెంటనే మీ దగ్గర తీసుకొని మంచి అమౌంట్ ఇస్తారు. 

ఇంటి తోట

చాలామంది ఇంట్లో తోట వేస్తున్నారు. ఇంటి తోట, కూరగాయల తోట ఇప్పుడు చాలా ఫేమస్. వాటికి కావాల్సిన వస్తువులు ఆన్‌లైన్‌లో అమ్మొచ్చు. లేదా తోట సెటప్ అంతా తీసుకెళ్లి వారి టెర్రస్ పై ఏర్పాటు చేయొచ్చు. ఇది కూడా స్పాట్ పేమెంట్, తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే బిజినెస్.

55

ఆన్‌లైన్ ఆర్డర్

ఫుడ్‌కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో రెస్టారెంట్ స్టార్ట్ చేయొచ్చు. అంటే క్లౌడ్ కిచెన్. ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుని వండి డెలివరీ చేయాలి.

తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో కామన్ సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేయొచ్చు. ఆధార్, పాన్ కార్డ్, గవర్నమెంట్ స్కీమ్స్ అని ప్రజలకు కావాల్సిన పని చేసి ఇవ్వొచ్చు.

గమనిక: ఏ బిజినెస్ స్టార్ట్ చేసేముందు ఎక్స్‌పర్ట్స్ దగ్గర ఒక మాట అడిగి తెలుసుకోవడం మంచిది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: కాస్త దిగొచ్చిన ధరలు.. ఈ ఊరట తాత్కాలికమేనా?
Recommended image2
ఇన్వెస్టర్లకు పీడకలగా మారిన స్టాక్.. రూ. 100 పెడితే మిగిలింది రూ. 14 మాత్రమే..
Recommended image3
CIBIL Score: క్రెడిట్ స్కోర్ సూపర్ ఉన్నా లోన్ రావట్లేదా.! తప్పు ఎక్కడ జరిగిందంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved