MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Business
  • Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు

Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు

Fathers Property: తండ్రి సంపాదించిన ఆస్తి తనదే అనుకుంటాడు కొడుకు. కానీ తండ్రి సంపాదించిన ఆస్తిపై కొడుకుకు ఎలాంటి హక్కు ఉండదని, తండ్రి ఇస్తేనే తీసుకోవాలని చెప్పింది కోర్టు.  తండ్రి సంపాదించిన ఇంట్లో కూడా అతని అనుమతితోనే కొడుకు ఉండాలని చెప్పింది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Dec 04 2025, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తండ్రి ఆస్తిపై కొడుకుకు నో హక్కు
Image Credit : Getty

తండ్రి ఆస్తిపై కొడుకుకు నో హక్కు

తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తిపై కుమారుడికి ఎలాంటి హక్కు ఉండదని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి ప్రేమతో కొడుకుని ఇంట్లో ఉండనిచ్చినంత మాత్రాన ఆ ఇంటిపై కుమారుడికి యాజమాన్యం వస్తుందని అనుకోవడం సరైంది కాదని కోర్టు తేల్చిచెప్పింది. పిల్లలు తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే ఇంట్లో ఉండగలరని, ఆ అనుమతి ఎప్పుడైనా వెనక్కు తీసుకునే హక్కు తండ్రికి ఉంటుందని కోర్టు పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆధారాలు అవసరం
Image Credit : Getty

ఆధారాలు అవసరం

ఒక కేసులో తండ్రి కొన్నేళ్ల క్రితం తాను కొనుకున్న స్థలంపై తన డబ్బుతోనే ఇల్లు కట్టాడు.కొడుకుకు పెళ్లి చేశాక ఉమ్మడి కుటుంబంగా అందరూ కలిసే ఉండేవారు. అయితే తర్వాత విభేదాలు రావడంతో కొడుకు కుటుంబాన్ని ఇంటి నుంచి వెళ్లమని చెప్పాడు. దీనితో కుమారుడు కోర్టుకెళ్లి ఈ ఇల్లు కుటుంబ ఆస్తి లో భాగమని, తాను కూడా సహయజమాని అని వాదించాడు. కానీ అతనికి దీనికి సంబంధించిన ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేవు.

Related Articles

Related image1
Silver Rate: జెట్ స్పీడ్‌లో పెరుగుతున్న వెండి ధర, దీనిపై భారీగా పెట్టుబడులు
Related image2
Credit Card Bill: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నారా? ఇలా అయితే అప్పు తీర్చేయచ్చు
34
తండ్రి ఒప్పుకుంటేనే.. ఉండాలి
Image Credit : Getty

తండ్రి ఒప్పుకుంటేనే.. ఉండాలి

ట్రయల్ కోర్టు, అప్పీల్ కోర్టు.. రెండూ అతని వాదనలను తిరస్కరించాయి. చివరకు హైకోర్టులో విచారణ జరిగినప్పటికీ అక్కడ కూడా అదే తీర్పు వచ్చింది. తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి ఆయన వ్యక్తిగత ఆస్తి. దాన్ని పిల్లలు తమ హక్కుగా చెప్పుకోలేరు. తండ్రి అనుమతి ఇస్తే ఇంట్లో ఉండవచ్చు. దీన్ని పెర్మిసివ్ ఆక్యుపేషన్ అంటారు. అంత మాత్రాన కొడుకు యజమాని అయిపోడు. కుటుంబ ఆస్తి అని చెప్పాలంటే స్పష్టమైన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని కోర్టు చెప్పింది.

44
అంతా తండ్రి నిర్ణయంపైనే
Image Credit : Getty

అంతా తండ్రి నిర్ణయంపైనే

ఈ తీర్పుతో కుటుంబాల్లో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఆస్తి గొడవలకు స్పష్టమైన మెసేజ్ వెళ్లింది. తల్లిదండ్రుల సంపాదనపై పిల్లలకు స్వయంగా ఎలాంటి హక్కు ఉండదు. ప్రేమతో, అనుబంధంతో ఇంట్లో ఉండనివ్వడం వల్ల ఆ ఆస్తిపై భాగస్వామ్యం ఏర్పడదు. తండ్రి తన ఆస్తిని ఎలా ఉపయోగించాలన్నా, ఎవరికి ఇవ్వాలన్నా, ఎవరిని ఇంట్లో ఉంచాలన్నా అది పూర్తిగా ఆయన హక్కే అని ఈ తీర్పు మరోసారి గుర్తు చేసింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
న్యాయ స‌ల‌హాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge plan: రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్
Related Stories
Recommended image1
Silver Rate: జెట్ స్పీడ్‌లో పెరుగుతున్న వెండి ధర, దీనిపై భారీగా పెట్టుబడులు
Recommended image2
Credit Card Bill: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నారా? ఇలా అయితే అప్పు తీర్చేయచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved