Nayara Energy: అంతర్జాతీయ స్థాయిలో సమీకృత డౌన్‌స్ట్రీమ్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్ కంపెనీ అయిన నయారా ఎనర్జీ, గోవాలో జరిగే H.O.G ర్యాలీ 2025లో అధికారిక ఫ్యూయలింగ్ పార్టనర్‌గా ఉత్సాహాన్ని నింపడానికి సిద్ధమైంది.
అంతర్జాతీయ స్థాయిలో సమీకృత డౌన్‌స్ట్రీమ్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్ కంపెనీ అయిన నయారా ఎనర్జీ, గోవాలో జరిగే H.O.G ర్యాలీ 2025లో అధికారిక ఫ్యూయలింగ్ పార్టనర్‌గా ఉత్సాహాన్ని నింపడానికి సిద్ధమైంది. డిసెంబర్ 19, 20 తేదీల్లో జరగనున్న ఈవెంట్‌ను asianetnews.com మీ ముందుకు తీసుకువస్తోంది. ఇది హార్లే-డేవిడ్‌సన్.. స్వేచ్ఛ, సోదరభావ సంస్కృతిని జరుపుకుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ సభ్యులను ఒకచోట చేర్చుతుంది. ఈ ర్యాలీని ఎపిసెంటర్ H.O.G చాప్టర్, నాగ్‌పూర్, ఐరన్ ఓర్ H.O.G. చాప్టర్, రాయ్‌పూర్ సమర్పిస్తున్నాయి.

భారతదేశపు రెండవ అతిపెద్ద సింగిల్-సైట్ రిఫైనరీని, 6,500కు పైగా రిటైల్ అవుట్‌లెట్‌ల దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ, దేశ రిఫైనింగ్ సామర్థ్యంలో ~8%, రిటైల్ ఫ్యూయల్ నెట్‌వర్క్‌లో ~7%, పాలిప్రొఫైలిన్ సామర్థ్యంలో ~8% వాటాను కలిగి ఉంది. asianetnews.com, ఇండియా H.O.G. ర్యాలీ 2025తో ఈ భాగస్వామ్యం అభిరుచి, పనితీరు, పురోగతి వంటి ఉమ్మడి విలువలను ప్రతిబింబిస్తుంది. ర్యాలీలోని శక్తి, ఉత్సాహం నాణ్యమైన ఇంధనం పట్ల కంపెనీ నిబద్ధతకు అద్దం పడతాయి. నయారా ఎనర్జీ ఇంధనం పనితీరుకు సరిపోతుందని మరోసారి చెప్పడానికి ఈ అనుబంధం ఒక నిదర్శనంగా చెప్పొచ్చు.
అందమైన మార్గాల గుండా రైడ్స్
ఇండియా H.O.G. ర్యాలీలో భాగంగా గోవాకు దారితీసే దేశంలోని అందమైన మార్గాల గుండా సుందరమైన రైడ్‌లు ఉంటాయి. ప్రముఖ కళాకారుల లైవ్ మ్యూజిక్ ప్రదర్శనలు, H.O.G. సభ్యులతో మీట్-అండ్-గ్రీట్ సెషన్‌లు, వార్షిక H.O.G. అవార్డుల వేడుక వంటి ఆకర్షణీయమైన కార్యక్రమాలతో ఇది ముగుస్తుంది. హార్లే-డేవిడ్‌సన్ సభ్యుల కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు అధికారిక ఇండియా H.O.G.™️ ర్యాలీ వెబ్‌సైట్లో ప్రారంభమయ్యాయి.


