- Home
- Business
- Business Idea: రూ. 50వేల పెట్టుబడితో రోజుకు వెయ్యి రూపాయల ఆదాయం.. గేమ్ ఛేంజర్ బిజినెస్
Business Idea: రూ. 50వేల పెట్టుబడితో రోజుకు వెయ్యి రూపాయల ఆదాయం.. గేమ్ ఛేంజర్ బిజినెస్
వ్యాపారం చేయాలని చాలా మంది ఉంటుంది. అయితే నష్టాలు వస్తాయేమో అన్న ఆలోచనతో, పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుందో అని వెనుకడుగు వేస్తుంటారు. అయితే మంచి ఆలోచన ఉంటే తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రస్తుతం మేక పాలకు డిమాండ్ పెరుగుతోంది. ఆవు, గేదె పాలతో పోల్చితే మేక పాలు ధర ఎక్కువ ఉండడం, పోషకాలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది మేక పాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకపాల వ్యాపారాన్ని ప్రారంభిస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ప్రారంభంలో ఈ వ్యాపారాన్ని రూ. 50 వేల పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
ఈ వ్యాపారాన్ని రూ. 50వేల బేసిక్ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే మేకలు పెంచడానికి కొంత స్థలం ఉండాలి. ఒక్కో మేక ధర సుమారు రూ. 10 వేలు ఉంటుంది. రూ. 50 వేలతో 5 మేకలను కొనుగోలు చేయొచ్చు. సాధారణంగా మంచి జాతి మేకలు రోజుకు ఒక లీటర్ పాలను ఇస్తాయి. ఈ లెక్కన రోజుకు 5 లీటర్ల మేక పాలు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక లీటర్ మేక పాల ధర తక్కువలో తక్కువ రూ. 200గా ఉంది. అంటే రోజుకు వెయ్యి రూపాయాలు ఆర్జించవచ్చు. అంటే కేవలం రూ. 50 వేల పెట్టుబడితో నెలకు రూ. 30 వేల ఆదాయం పొందొచ్చు.
Benefits of Goat milk
పెట్టుబడితో పాటు మేకలను పెంచుకుంటూ పోతే నెలవారి ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే మేకల పాల ఉత్పత్తి పెరిగేందుకు మంచి గడ్డిని మేతగా అందించాలి. అలాగే రోజూ తగినంత నీరు అందించారు. మేకల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన టీకాలను అందించాలి.
మేక పాలకు ఎందుకంత డిమాండ్.?
మేకపాలలో అధిక పోషకాలు ఉంటాయి. మేకపాలలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. లాక్టోజ్ ఇంటోలరెన్స్ ఉన్నవారికి మేకపాలు మంచి ప్రత్యామ్నాయం. పిల్లల పెరుగుదలకు, హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి.క్యాన్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు, పేగు సమస్యల నివారణకు ఉపయోగపడతాయి. ఈ పాలలో క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మేక పాలు ఉపయోగపడతాయి.