Asianet News TeluguAsianet News Telugu

డిసెంబర్ 8న గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలు, స్టాక్ మార్కెట్లకు బూస్ట్ ఇస్తాయా..ఆల్ టైం హై నుంచి పయనం ఎటువైపు

డిసెంబర్ 8న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నిజానికి ఎన్నికల ఫలితాలు మార్కెట్లకు మేజర్ ఫ్యాక్టర్ కావచ్చు. కానీ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ గుజరాత్ లో మరోసారి అధికారం చేపట్టవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. కానీ మార్కెట్లు మాత్రం మంగళవారం కూడా నెగిటివ్ గానే ట్రేడవుతున్నాయి. ఆల్ టైం గరిష్ట స్థాయి సమీపంలో ఉన్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.  

December 8 Gujarat and Himachal election results will they give a boost to the stock markets where is the journey from all time high
Author
First Published Dec 6, 2022, 12:20 PM IST

స్టాక్ మార్కెట్లు ఎగ్జిట్ పోల్స్ అనంతరం కూడా ప్రాఫిట్ బుకింగ్ నడుస్తోంది.మంగళవారం క్షీణతతో మార్కెట్ ప్రారంభమైంది.ఈ రోజు సెన్సెక్స్ 292.95 పాయింట్లు (0.47 శాతం) పడిపోయి 62,541 స్థాయి వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో, నిఫ్టీ 83.50 పాయింట్ల (0.45 శాతం) క్షీణతతో 18617.50 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.  సోమవారం కూడా మార్కెట్ పతనంతో ముగిసింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 8న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 

ఈ నేపథ్యంలో మార్కెట్లో గురువారం పాజిటివ్ గా స్పందించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే మార్కెట్లు జీవిత కాల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఎలక్షన్ రిజల్ట్ మార్కెట్లకు పెద్ద ఈవెంట్ కాకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లు గత రెండు రోజులుగా ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టాల్లో ఉన్నాయి. రేపు ఆర్బీఐ ఎంపీసీ సమావేశం రిజల్ట్ రానుంది. కీలక వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం రావచ్చని మార్కెట్లు ముందుగానే ఊహిస్తున్నాయి. ఇది కూడా నెగిటివ్ సెంటిమెంటుకు ఆజ్యం పోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

నిపుణులు ఏమి చెబుతున్నారు
చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విజయ్ కుమార్ స్పందిస్తూ, . ప్రస్తుతం మార్కెట్‌లో 2 ట్రెండ్‌లు నడుస్తున్నాయని చెప్పారు. మొదటిది, USలో జాబ్ డేటా, లేబర్ మార్కెట్ పరిస్థితి బాగానే ఉంది, ఇది అక్కడ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చూపిస్తుంది. అయితే, ఈ గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచేలా ప్రోత్సహిస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో చూస్తున్నారు. రెండో ట్రెండ్ దేశీయంగా ఉంది. భారతదేశంలో పన్నుల వసూళ్లు, క్రెడిట్ వృద్ధి పెరిగింది 

అదే సమయంలో ముడి చమురు ధరలు పడిపోతున్నాయి, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తోంది. భారతదేశం స్టాక్ మార్కెట్ రిటైల్ ఇన్వెస్టర్లు DII ఇన్వెస్టర్ల నుంచి మద్దతు పొందుతుంది. పెట్టుబడిదారులు ఈ మార్గంలో ముందుకు సాగవచ్చని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే మరో వైపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం రేపటితో ముగుస్తోంది. ఈ సమావేశంలో, ద్రవ్యోల్బణం లక్ష్యం బ్యాండ్ 6 శాతానికి పైగా ఉండటంతో, అందరి దృష్టి RBI కీలక రేట్ల పెంపు చేయవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీని కారణంగా సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును మళ్లీ పెంచుతుందని భావిస్తున్నారు.RBI MPCమూడు రోజుల సమావేశం ముగింపులో డిసెంబర్ 7న తన తదుపరి ద్వైమాసిక పాలసీ సమీక్షను సమర్పించనుంది.

దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే మే నుండి 190 బేసిస్ పాయింట్లు 5.9 శాతానికి పెంచింది. రాయిటర్స్ ఆర్థికవేత్తల ప్రకారం ఆర్బీఐ వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్లు పెంచి 6.25 శాతానికి పెంచే అవకాశం ఉందని తేల్చింది. గత మూడు సార్లు ఆర్‌బీఐ 50 బేసిస్ పాయింట్లను పెంచింది. ద్రవ్యోల్బణ కట్టడిలో విఫలమైనందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికపై చర్చించడానికి నవంబర్ ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (MPC) అవుట్-ఆఫ్-టర్న్ సమావేశం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చట్టం 1934లోని సెక్షన్ 45ZN ప్రకారం, ద్రవ్యోల్బణాన్ని లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైతే, తీసుకోవలసిన చర్యలకు సంబంధించి ఈ సమావేశం నిర్వహిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios