Asianet News TeluguAsianet News Telugu

Ceremorphic sets up India: భార‌త్‌లో తొలిసారి.. హైద‌రాబాద్‌లో సెరిమోర్ఫిక్ సెంట‌ర్‌

దాదాపు 100కు పైగా పేటెంట్లు క‌లిగి, కొన్ని ద‌శాబ్దాలుగా ఐటీ ప‌రిశ్ర‌మలో మేటిగా ఉన్న సిలికాన్ సిస్ట‌మ్స్‌లో నైపుణ్యం ఉన్న సంస్థ సెరిమోర్ఫిక్‌.

Ceremorphic sets up India
Author
Hyderabad, First Published Jan 25, 2022, 4:57 PM IST

భారతదేశంలో తొలిసారిగా సెరిమోర్ఫిక్ హైద‌రాబాద్‌ లో తన డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. రిలయబుల్‌ హై పెర్ఫార్మింగ్‌ కంప్యూటింగ్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన కొత్త ఆర్కిటెక్చర్‌ ఇవ్వాలని లక్ష్యంతో ఈ సంస్థ ప‌ని చేస్తోంది. దాదాపు వందకు పైగా పేటెంట్లు కలిగి, కొన్ని దశాబ్దాలుగా ఐటీ పరిశ్రమ (IT Industry) లో మేటిగా ఉన్ సిలికాన్‌ సిస్టమ్స్‌లో నైపుణ్యం ఉన్న సంస్థ‌గా సెరిమోర్పిక్ ఉంది. ఈ సంస్థ తాజాగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), హై పవర్‌ కంప్యూటింగ్‌ (హెచ్‌పీసీ), ఆటోమోటివ్‌ ప్రాసెసింగ్‌, డ్రగ్‌ డిస్కవరీ, మెటావర్స్ ప్రాసెసింగ్, వీటన్నింటికీ అనువుగా ఉండే పూర్తిస్థాయి సిలికాన్‌ సిస్టమ్‌ ను అందించే ప్రణాళికలో ఉన్నట్లు ప్రకటించింది. 

అత్యాధునిక సిలికాన్‌ జామెట్రీ (టీఎస్‌ఎంసీ 5ఎన్‌ఎం నోడ్‌)తో డిజైన్‌ చేసిన ఈ కొత్త ఆర్కిటెక్చర్‌ ను సెరిమోర్భిక్‌9 ఈ సంస్థ రూపొందించింది. కొత్త త‌రంలో నిహై పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ సమస్యలను పరిష్కరించి, ఎక్కువ డిమాండ్‌ ఉన్న మార్కెట్‌సెగ్మెంట్లకు సేవలందించేందుకు దీన్ని రూపొందించారు.ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సెమికండక్టర్‌ (Semiconductor) పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించాలనే ఉద్దేశంతో సెరిమోర్ఫిక్ ముంద‌డుగు వేస్తోంది. ఇండియాలో సెమికండ‌క్ట‌ర్ మార్కెట్‌ను పెంచ‌డంలో ఈ సంస్థ వివిధ సంస్థ‌ల‌తో క‌లిసి ప‌ని చేయ‌నుంది.

సెమీకండక్టర్ త‌యారీలో ఇండియా కీల‌క పాత్ర పోషించ‌బోతుంది. హైదరాబాద్‌లోని సెరిమోర్ఫిక్ ఇండియా (India) డెవలప్‌మెంట్ సెంటర్‌ భారతదేశాన్ని తదుపరి గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చడంలో ప్రభుత్వ ప్రయత్నాలను పూర్తి చేయడానికి సరైన దిశలో ఇది ఒక అడుగుగా మేధావులు, మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. సెరిమోర్ఫిక్ ప్రస్తుతం 150 మందికి ఉపాధి కల్పిస్తోంది మరియు 2024 చివరి నాటికి, తన హైదరాబాద్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ద్వారా 400 మందికి ఉపాధి కల్పించాలని యోచిస్తోంది.

సెరిమోర్ఫిక్ సంస్థ మునుపెన్న‌డూ లేనంత సామ‌ర్థ్యంతో టీఎస్‌ఎంసీ 5ఎన్‌ఎం నోడ్‌తో, సూపర్‌ కంప్యూటింగ్‌ చిప్‌ డిజైన్‌ చేసేందుకు కృషిచేస్తోంది. కంపెనీకి ఉన్న మంచి టెక్నాలజీ (Technology) పోర్ట్‌ ఫోలియో, ఉత్పత్తుల డిజైన్‌ ప్లాన్‌ తో వచ్చే సంవత్సరానికి (2023) ప్లాన్‌ చేసిన కస్టమర్‌ శాంపిళ్లతో నిరంతర  పురోగతి సాధించే దిశలో సాగుతోంది. ఈ విషయమై స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని ఎలక్టికల్‌ ఇంజినీరింగ్‌, (Electrical Engineering)  కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ప్రొఫెసర్‌ సుభాశీస్‌ మిత్రా మాట్లాడారు. కంప్యూటింగ్‌ స్పేస్‌లో ప్రస్తుతం పనితీరు, నమ్మకం విషయంలో ఉన్న కొన్ని కీలకమైన సవాళ్లను పరిష్కరించడంలో సెరిమోర్ఫిక్ అనుసరిస్తున్న విధానం నాకెంతో నచ్చింద‌ని ఆయ‌న అన్నారు.

“రెడ్‌పైన్‌ సిగ్నల్స్‌ ఇంక్‌., భారతదేశంలోని హైదరాబాద్‌ నుంచి మొత్తం వైర్‌లెస్‌ టెక్నాలజీని రూపొందించిందని తెలిసి నేనెంతో సంతోషించాను. అది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగరంలో గల ఇంజినీరింగ్‌ టాలెంట్‌, మౌలిక సదుపాయాల సామర్థ్యాల‌కు కొదువ‌లేదు." అని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అన్నారు.

ప్రముఖ శాస్త్రవత్త, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వి.5. సారస్వత్‌ మాట్లాడుతూ, “హైలీ డిఫరెన్షియటెడ్‌ వైర్‌లస్ టెక్నాలజీని, ఉత్పత్తులను పూర్తిగా భారతదేశం నుంచే తయారుచేసిన రెడ్‌పైన్‌ సిగ్నల్స్‌ ఇంక్‌., లాంటి సంస్థ మన దేశంలోని టాలెంట్‌ సామర్ధ్యాన్ని నిరూపించింది. మేం ప్రారంభించిన నేషనల్‌ సూపర్‌ కంప్యూటర్‌ మిషన్ (ఎన్‌ఎస్‌ఎం)లోను, సెమీకండక్టర్‌ టెక్నాలజీలోను వెంకట్‌, ఆయన బృందం చురుగ్గా పాల్గొంటున్నారు. వెంకట్‌ కొత్త వెంచర్ అయిన హై పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ స్పేస్‌ విషయంలో నేను ఎంతో ఆశాభావంతో ఉన్నాను" అని అన్నారు.

భవిష్య‌త్‌లో ఎంతో ప్రాముఖ్య‌త ఉండే ఏఐ, ఎంఎల్ వంటి టెక్నాల‌జీల‌పై సెరిమోర్ఫిక్ దృష్టిసారించింది. హైప‌ర్ఫామెన్స్ కంప్యూటింగ్ అనేది ఇండియాలో మంచి భ‌విష్య‌త్ ఉన్న అంశం. బృందం ఓఈఎం నెట్‌వర్క్ తో కలిసి డేటాసెంటర్‌, ఏఐ శిక్షణ, రోబోటిక్స్‌, ఆటోమోటివ్‌, మెటావర్స్‌ ప్రాసెసింగ్‌, లైఫ్‌సైన్సెస్‌ లాంటి గుర్తించిన మార్కెట్ సెగ్మెంట్లకు తుది ఉత్పత్తులను రూపొందించడానికి సెరిమోర్ఫిక్ ప్రయత్నిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios