టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ వింతైన సంఘటన ఎదురైంది. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి వల్ల టిమ్‌ కుక్‌ వేధింపులకు గురయ్యాడు. అమెరికా దేశం పాలో ఆల్టోలోని కుక్‌ నివాసంలోకి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి  రెండు సార్లు అక్రమంగా చొరబడి అనుచితంగా ప్రవర్తించాడు.  అంతటితో ఆగకుండా  ఫోన్‌ ద్వారా బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు.

ఈ సంఘటనపై ఆపిల్‌ ఫిర్యాదు చేయడంతో కాలిఫోర్నియా కోర్టు అతనిపై కొంతకాలం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిలికాన్ వ్యాలీలోని కుక్ నివాసం, ఆయన సెక్యూరిటీ గార్డులు ముగ్గురు, ఆపిల్ పార్క్ ప్రధాన కార్యాలయానికి దూరంగా ఉండాలని కూడా ఆదేశించింది. అయితే తదుపరి విచారణ మార్చి 3వ తేదీ దాకా ఈ ఉత్తర్వులు అమల్లో వుంటాయని కోర్టు తెలిపింది.

also read చైనా విమానాలకు కరోనా వైరస్.... 2లక్షల కోట్ల నష్టం అంచనా....

రాకేశ్ శర్మ అనే భారతీయ వ్యక్తి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ ఇంట్లోకి చొరబడి అతని పై దాడికి యత్నించాడు. డిసెంబర్ 4 తేదీన రాకేశ్ శర్మ అనే వ్యక్తి (41) రాత్రి 10:30 సమయంలో అనుమతి లేకుండా షాంపైన్ బాటిల్‌, పువ్వులు తీసుకొని టిమ్ కుక్ ఇంట్లోకి చొరబడి అనుచితంగా ప్రవర్తించాడు.

ఒక నెల తరువాత జనవరి 15న మళ్ళీ అవాంఛనీయ కాల్ చేసిన బెదిరింపులకు పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత, శర్మ తన ట్విటర్‌  ఖాతాలో ఆపిల్ ఎగ్జిక్యూటివ్‌ను ట్యాగ్ చేస్తూ కొన్నిఅభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఫోటోలు షేర్‌  చేశాడు. అలాగే జనవరి 15న మరోసారి  ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుండగా  భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. 

" శర్మ వల్ల పెరుగుతున్న బెదిరింపుల వల్ల నాకు, ఇతర ఆపిల్ ఉద్యోగులకు మానసిక ఇబ్బంది కలిగిస్తుందని, వ్యక్తిగత భద్రత పట్ల నాకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది" అని ఆపిల్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ చెప్పారు. శాన్ఫ్రాన్సిస్కో నగరానికి చెందిన శర్మ టిమ్ కుక్‌పై విమర్శకుడని తేలింది. టిమ్ కుక్‌ను విమర్శిస్తూ వీడియోను ఫేస్‌బుక్‌లో  కూడా పోస్ట్ చేశారు.

also read అంతా ఇండియా వల్లే: ఇరుదేశాల వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్...

మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని హెచ్చరిస్తూ ఆపిల్‌ న్యాయవాదులు అతనికి ఒక లేఖ పంపించారు. అయినా అతను బెదరకుండ  ఈసారి ఆపిల్‌ టెక్నికల్‌ టీంకు కాల్‌ చేసి కంపెనీ తనను చంపడానికి చూస్తోందని ఆరోపించాడు.

మళ్లీ ఒక నెల తరువాత తిరిగి వచ్చిన అతగాడు ఏకంగా టిమ్‌ కుక్‌ నివాసంలోని గేటులోకి ప్రవేశించి డోర్ బెల్ మోగించాడని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. మరోవైపు కుక్‌ నివాసం వద్ద పదపదే నిబంధనలను ఉల్లంఘించడం, తుపాకీ గురించి మాట్లాటడం చేశాడని,  శారీరకంగా తనకు  హాని చేస్తాడని గట్టిగా నమ్ముతున్నానని  కుక్‌ సెక్యూరిటీ బృందంలోని ఒక సభ్యుడు ఆరోపించారు.