కేంద్ర ప్రభుత్వం... జమ్మూ కశ్మీర్ విషయంలో సోమవారం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.  కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటిస్తుందనే వార్తల నేపథ్యంలో ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఇది కేవలం మరో సోమవారం ఉదయం అనే భావన సరికాదని, కశ్మీర్‌పై దేశం యావత్తూ ఉత్కంఠతో ఎదురుచూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌లో అందరూ సురక్షితంగా ఉండాలని.. దేశ పటిష్టత, భవిష్యత్‌ను ఇనుమడింపచేసే నిర్ణయం వెలువడాలని మనం ప్రార్ధించాలని మహీంద్ర గ్రూప్‌ అధినేత ట్వీట్‌ చేశారు. మరోవైపు కశ్మీర్‌పై కేంద్ర కేబినెట్‌లో కీలక చర్చలు సాగిన క్రమంలో పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన  చేశారు. కశ్మీర్ ని రెండు భాగాలుగా విడదీస్తున్నట్లు చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేశారు. జమ్మూ, కశ్మీర్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించేశారు. ఈ రెండిటితో సంబంధం లేకుండా లడఖ్ ని కూడా ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. అంతేకాకుండా లడఖ్ కి కనీసం చట్టసభ కూడా లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు.

related news

స్వయం ప్రతిపత్తి రద్దు: మూడు ముక్కలైన కాశ్మీర్, గెజిట్ విడుదల

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం