సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత టాటా మోటార్స్ ‘ఎస్‌యూవీ’ మోడల్ కారు ‘టాటా టియాగో ఎన్నార్జీ’ ని మార్కెట్‌లోకి బుధవారం విడుదల చేసింది. అంతే కాదు కార్ల అభిమానులకు మరో తీపి కబురు అందించింది. వచ్చే దీపావళి పండుగ నాటికి టియాగో జేటీవీ డెరివేటివ్‌తోపాటు నాలుగు కార్లను మార్కెట్ లోకి తేనున్నట్లు ప్రకటించింది. హ్యాచ్ బ్యాక్ క్రిస్టెన్డ్ ‘టాటా టియాగో ఎన్నార్టీ’ కారు పెట్రోల్ వేరియంట్ రూ.5.53 లక్షలు, డీజిల్ వేరియంట్ మోడల్ కారు రూ.6.38 లక్షలకు అందుబాటులో తెచ్చింది. 

టాటా టియాగో ఎన్నార్జీ మోడల్ కారును అభివృద్ధి చేయడానికి సంస్థకు ఏడాది సమయం పట్టింది. ఈ కారుకు ఎస్‌యూవీ మోడల్ లుక్ తీసుకొచ్చేందుకు దాని ఎక్స్‌టీరియర్ లుక్‌లో మార్పులు తీసుకొచ్చింది.  1.2 లీటర్ల పెట్రోల్, 1.05 లీటర్ల డీజిల్ నిల్వ సామర్థ్యం గల పవర్ ట్రైన్స్ (ఇంజిన్ అండ్ ట్రాన్స్‌మిషన్) ఉంటాయి. ఏఎంటీ గేర్ బాక్స్, 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఏర్పాటు చేశారు. 

వీటితోపాటు టాటా టియాగో ఎన్నార్జీ మోడల్ కార్లు డ్యుయల్ ట్యూన్ కలర్ స్కీమ్, న్యూ వీల్ ఆర్చెస్, ఫుల్ బ్యాక్ ఇంటీరియర్స్, ఆరెంజ్ స్టిచింగ్, 8 స్పీకర్ల వ్యవస్థతో కూడిన ఐదంగుళాల టచ్ స్క్రీన్‌, రూఫ్ రెయిల్స్ తదితర ఆఫ్ రోడింగ్ లుక్ వంటి అదనపు ఆకర్షణలు ఉన్నాయి. మారుతి సుజుకి వాగన్ ఆర్ తన ప్రత్యర్థి హ్యుండాయ్ సాంత్రో, హ్యుండాయ్ ఏహెచ్2 మోడల్‌కు టాటా టియాగో ఎన్నార్జీ పోటీ ఇవ్వనున్నది.

ఏబీఎస్, ఈబీడీ వంటి అత్యంత పటిష్టమైన ప్రమాణాలతో కూడిన డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయడంతోపాటు రివర్స్ ప్యాకింగ్, హోం హెడ్ ల్యాంప్స్ ప్యాకేజీ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ ప్రయాణ వాహనాల బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు మయాంక్ పరీక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘గత 28 నెలల్లో ఇప్పటికే 1.7 లక్షల టియాగో కార్ల యూనిట్లు విక్రయించాం. ఇది హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో ఇది ఒకటి. మేం కస్టమర్లకు కొత్తదనాన్ని అందుబాటులోకి తేవడానికి చేస్తున్న ప్రయత్నమే టాటా టియాగో’ అని తెలిపారు. 

ప్రతి నెలలోనూ వెయ్యి నుంచి 1200 కార్లు అమ్మగలమని సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం నెలకు 8,000 నుంచి 9000 కార్లను తయారు చేస్తోంది. టాటా టియాగో ఎన్నార్జీ మోడల్ మలబార్ సిల్వర్, కెన్యాన్ ఆరెంజ్, ఫుజి వైట్ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. 14 అంగుళాల అల్లాయ్ వీల్స్, డార్కర్ థీమ్ తో ఈ కారును రూపొందించారు. ఇంకా దీనికి ఫ్రంట్ అండ్ రేర్ బంపర్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, వీల్ ఆర్చెస్ ఏర్పాటు చేశారు. డోర్ హ్యాండిల్స్, ఔట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్‌తో రోడ్డుకు ఇరువైపులా వచ్చే వాహనాలను కనిపెట్టవచ్చు. టాటా టైగర్ మోడల్ కారులో గల స్మోక్డ్ ప్రొజెక్టర్ హెడ్‍ల్యాంప్ యూనిట్‌నూ ఇందులో ఏర్పాటు చేశారు.