MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Automobile
  • Honda Shine : మిడిల్ క్లాస్ పీపుల్స్ మెచ్చిన స్టైలిష్ బైక్.. కేవలం రూ.80 వేలకే మీసొంతం

Honda Shine : మిడిల్ క్లాస్ పీపుల్స్ మెచ్చిన స్టైలిష్ బైక్.. కేవలం రూ.80 వేలకే మీసొంతం

రోజూ ఆఫీసులకు, వివిధ పనులకు వెళ్లేవారికి హోండా షైన్ 125 బైక్ ఒక మంచి ఎంపిక. ఇది 55 kmpl మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, స్మూత్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్‌కు పెట్టింది పేరు. దీని ధర, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 16 2026, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ ధరకే హోండా బైక్..
Image Credit : Google

తక్కువ ధరకే హోండా బైక్..

పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా చాలామంది రోజూ ఆఫీస్‌ లేదా ఇతర పనులకు వెళుతుంటారు… వీరికి బైక్ తప్పనిసరి. ఇలాంటివారికి హోండా షైన్ 125 చాలాకాలంగా బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. సులభమైన రైడింగ్, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుల వల్ల ఈ బైక్ మధ్యతరగతి ప్రజల్లో బాగా పాపులర్ అయింది. దీని డిజైన్, స్మూత్ ఇంజిన్ పనితీరు వల్ల రోజువారీ ప్రయాణాలకు చాలా సౌకర్యవంతమైన ఎంపికగా నిలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హోండా షైన్ ఇంజిన్ పనితీరు...
Image Credit : Google

హోండా షైన్ ఇంజిన్ పనితీరు...

ఈ హోండా షైన్ బైక్‌లో 123.94cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ PGM-FI ఇంజిన్‌ను అమర్చారు. BS6 నిబంధనలకు అనుగుణంగా ఉండే ఈ ఇంజిన్ సుమారు 10.59 bhp శక్తిని, 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రావడం వల్ల నగర ప్రయాణాల్లో స్మూత్ రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ గరిష్ఠంగా గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలదని చెబుతున్నారు.

Related Articles

Related image1
Bike: ఈ బైక్ మైలేజ్ కింగ్‌.. ట్యాంక్ ఫుల్ చేస్తే 800 కి.మీలు వెళ్లొచ్చు. ధ‌ర రూ. 65 వేలే
Related image2
Long Drive EV Bike: ఈ బైక్‌ను 20 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 600 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోవచ్చు
35
హోండా షైన్ మైలేజ్, ఫ్యూయల్ కెపాసిటీ
Image Credit : Honda

హోండా షైన్ మైలేజ్, ఫ్యూయల్ కెపాసిటీ

మైలేజ్ విషయంలో హోండా షైన్ 125కు మంచి పేరుంది. ARAI డేటా ప్రకారం… ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌ తో సుమారు 55 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు. ఇందులో 10.5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉన్నందున, ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

45
కొత్త ఫీచర్లు, భద్రత
Image Credit : honda

కొత్త ఫీచర్లు, భద్రత

హోండా షైన్ 125 బైక్‌లో చాలా ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా రియల్ టైమ్ మైలేజ్, డిస్టెన్స్-టు-ఎంప్టీ, సర్వీస్ రిమైండర్ వంటి సమాచారాన్ని చూడవచ్చు. అదనంగా 15W USB-C ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడంతో ప్రయాణంలో మొబైల్‌ను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. భద్రత కోసం CBS బ్రేకింగ్ సిస్టమ్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, 240mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

55
హోండా షైన్ ధర, వేరియంట్స్
Image Credit : honda

హోండా షైన్ ధర, వేరియంట్స్

భారత్‌లో హోండా షైన్ 125 రెండు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. డ్రమ్ బ్రేక్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.80,852. అదే సమయంలో డిస్క్ బ్రేక్ మోడల్ ధర సుమారు రూ.85,211 వరకు ఉంటుంది. ఆర్‌టీఓ, ఇన్సూరెన్స్ వంటి ఛార్జీలను కలుపుకుంటే ఆన్‌రోడ్ ధర రూ.94,000 నుండి రూ.99,000 వరకు వెళ్లవచ్చు. 125cc విభాగంలో ఇది హీరో స్ప్లెండర్, టీవీఎస్ రైడర్ 125 వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kia Car Offers : కియా కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల భారీ డిస్కౌంట్
Recommended image2
Maruti Baleno : మీదగ్గర కేవలం రూ.11,000 ఉంటే చాలు.. సరికొత్త మారుతి బాలెనో కారు సొంతం చేసుకొండి
Recommended image3
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Related Stories
Recommended image1
Bike: ఈ బైక్ మైలేజ్ కింగ్‌.. ట్యాంక్ ఫుల్ చేస్తే 800 కి.మీలు వెళ్లొచ్చు. ధ‌ర రూ. 65 వేలే
Recommended image2
Long Drive EV Bike: ఈ బైక్‌ను 20 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 600 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved