MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Automobile
  • Cheapest Petrol : 55 పైసలకే డీజిల్, 2 రూపాయలకే పెట్రోల్.. ఈ దేశాల్లో ఫ్యూయల్ చాక్లెట్ కంటే చీఫ్ గురూ..!

Cheapest Petrol : 55 పైసలకే డీజిల్, 2 రూపాయలకే పెట్రోల్.. ఈ దేశాల్లో ఫ్యూయల్ చాక్లెట్ కంటే చీఫ్ గురూ..!

మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్దవాతావరణం కారణంగా ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. మరి యుద్దం జరుగుతున్న ఇరాన్ లో వీటి ధరలు ఎలా ఉన్నాయి..? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 13 2026, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రపంచంలో పెట్రోల్ ధర అతి తక్కువగా ఉన్న దేశమేది..?
Image Credit : X

ప్రపంచంలో పెట్రోల్ ధర అతి తక్కువగా ఉన్న దేశమేది..?

Petrol Diesel Price : ఇజ్రాయెల్, అమెరికా దేశాలతో ఇరాన్ యుద్దం ఎఫెక్ట్ యావత్ ప్రపంచంపై కనిపిస్తోంది. ఇండియాపై కూడా యుద్ద ప్రభావం గట్టిగానే ఉంది... ఇప్పటికే వంటగ్యాస్ (LPG) కొరత ఏర్పడింది... దీంతో హోటళ్లు, రెస్టారెంట్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించింది కేంద్రం. ఇక ప్రపంచ మార్కెట్ లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు పెరిగాయి... దీంతో మన చుట్టుపక్కల దేశాలు శ్రీలంక, పాకిస్థాన్ లు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి. భారత్ ఇప్పటికయితే పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తోంది... కానీ ఆయిల్ కంపెనీల ఒత్తిడితో త్వరలోనే ధరలు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటే అవకాశాలున్నాయట... దేశవ్యాప్తంగా ఇదే స్థాయిలో పెరుగుదల ఉంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇలా సామాన్యులపై ఇంధన భారం పెరిగే అవకాశాలున్నాయి. అయితే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే ఇండియా లాంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి... మరి ఉత్పత్తి చేసే దేశాల్లో ఎలా ఉంటాయి..? మరీముఖ్యంగా యుద్దం జరుగుతున్న ఇరాన్ లో వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..? చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇరాన్‌లో చాక్లెట్ కంటే చీప్ గా డీజిల్, పెట్రోల్...
Image Credit : X

ఇరాన్‌లో చాక్లెట్ కంటే చీప్ గా డీజిల్, పెట్రోల్...

ప్రస్తుతం యుద్ద వాతావరణంతో అట్టుడికిపోతున్న ఇరాన్ లో చమురు నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. ఈ దేశం నుండే అత్యధికంగా క్రూడ్ ఆయిల్ ను ప్రపంచ దేశాలకు సరఫరా అవుతుంది. అయితే చాలా మిడిల్ ఈస్ట్ దేశాల్లో చమురు ఉత్పత్తి అవుతుంది... వీటన్నింటితో పోలిస్తే ఇరాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువ. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర భారత కరెన్సీలో కేవలం రూ.2.68... డీజిల్ ధర కేవలం 55 పైసలు మాత్రమే. ఇరాన్‌లో భారీ చమురు నిల్వలు, ప్రభుత్వ సబ్సిడీలే దీనికి కారణం.

Related Articles

Related image1
Fuel Saving Tips : పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా డోంట్ వర్రీ.. మీ డబ్బులు ఆదాచేసే 7 సూపర్ ట్రిక్స్
Related image2
Petrol Price : ఇండియాకూ పాక్, శ్రీలంక పరిస్థితేనా..? పెట్రోల్, డీజిల్ ధరలు అంతలా పెరుగుతాయా..?
36
వెనిజులాలో లీటర్ డీజిల్ కేవలం రూ.37 పైసలే...
Image Credit : Getty

వెనిజులాలో లీటర్ డీజిల్ కేవలం రూ.37 పైసలే...

ఇరాన్ మాదిరిగానే వెనిజులా కూడా తమ దేశ ప్రజలకు చాలా తక్కువధరకే పెట్రోల్, డీజిల్ అందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్న వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర రూ.3.23. డీజిల్ ధర ఇరాన్ కన్నా తక్కువ... కేవలం 37 పైసలు మాత్రమే. దశాబ్దాలుగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలే ఈ తక్కువ ధరలకు కారణం.

46
కువైట్ లో పెట్రోల్, డీజిల్ ధరలు...
Image Credit : X

కువైట్ లో పెట్రోల్, డీజిల్ ధరలు...

కువైట్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువ. ఇక్కడ లీటర్ పెట్రోల్ సుమారు రూ.31.5, డీజిల్ రూ.34.6 (ఇండియన్ కరెన్సీలో) లభిస్తుంది. ఇక అల్జీరియాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 32.7 కాగా, డీజిల్ ధర రూ. 20.7 మాత్రమే.

56
అంగోలాలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు..
Image Credit : Pixabay

అంగోలాలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు..

అధిక చమురు సంపద ఉన్న మరో దేశం అంగోలా… ఇది ఆఫ్రికన్ కంట్రీ.  ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగానే ఉన్నాయి. అంగోలాలో లీటర్ పెట్రోల్ ధర రూ.30.3, డీజిల్ ధర రూ.40.3. అంగోలా ఒక ప్రధాన చమురు ఉత్పత్తి దేశం కావడం, అధిక దేశీయ ఉత్పత్తి ఉండటమే దీనికి కారణం.

66
ఈజిప్ట్ లో ఫ్యూయల్ ధరలివే..
Image Credit : Pixabay

ఈజిప్ట్ లో ఫ్యూయల్ ధరలివే..

మార్చి 2026 నాటికి, ఈజిప్టులో లీటర్ పెట్రోల్ ధర రూ.31.3, డీజిల్ ధర సుమారు రూ.34.1. గా ఉన్నాయి. ఈ దేశాల్లో ఇంధన ధరలు ఇంత చౌకగా ఉండటానికి ప్రభుత్వ సబ్సిడీలు, దేశీయ ఇంధన ఉత్పత్తి ప్రధాన కారణాలు. 

క్రూడ్ ఆయిల్ నిల్వల కారణంగానే ఒకప్పుడు పేద దేశాలు ఇప్పుడు రిచ్ కంట్రీస్ గా మారాయి… అక్కడి ప్రభుత్వాలు తమ ప్రజలకు మెరుగైన పాలన అందించగలుగుతున్నాయి. విరివిగా లభించే పెట్రోల్, డీజిల్ ను అతి తక్కువ ధరకే ప్రజలకు అందించగలుగుతున్నాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
యుద్ధం
ఏషియానెట్ న్యూస్
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
వ్యాపారం
ప్రపంచం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kia Car Offers : కియా కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల భారీ డిస్కౌంట్
Recommended image2
Maruti Baleno : మీదగ్గర కేవలం రూ.11,000 ఉంటే చాలు.. సరికొత్త మారుతి బాలెనో కారు సొంతం చేసుకొండి
Recommended image3
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Related Stories
Recommended image1
Fuel Saving Tips : పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా డోంట్ వర్రీ.. మీ డబ్బులు ఆదాచేసే 7 సూపర్ ట్రిక్స్
Recommended image2
Petrol Price : ఇండియాకూ పాక్, శ్రీలంక పరిస్థితేనా..? పెట్రోల్, డీజిల్ ధరలు అంతలా పెరుగుతాయా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved