MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • లక్కీ ఛాన్స్... రూ.2.5 లక్షల ఈవి బైక్ కేవలం రూ.1.49 లక్షలకే..

లక్కీ ఛాన్స్... రూ.2.5 లక్షల ఈవి బైక్ కేవలం రూ.1.49 లక్షలకే..

అల్ట్రావయొలెట్ కంపెనీ తన X-47 క్రాసోవర్ ఎలక్ట్రిక్ బైక్ కోసం 'బ్యాటరీ ఫ్లెక్స్' అనే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లను కొనడం ఇప్పుడు మరింత సులభం కానుంది.

1 Min read
Author : Arun Kumar P
Published : Mar 07 2026, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్ట్రావయొలెట్ X 47 ఎలక్ట్రిక్ బైక్...
Image Credit : Google

అల్ట్రావయొలెట్ X-47 ఎలక్ట్రిక్ బైక్...

ఎలక్ట్రిక్ టూవీలర్లను మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చేందుకు అల్ట్రావయొలెట్ కంపెనీ 'బ్యాటరీ ఫ్లెక్స్' ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ కింద కస్టమర్లు అల్ట్రావయొలెట్ X-47 క్రాసోవర్ బైక్‌ను తక్కువ ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకు సుమారు రూ.2.50 లక్షలు ఉన్న ఈ బైక్, కొత్త ప్లాన్‌లో భాగంగా రూ.1.49 లక్షల ప్రారంభ ధరకే లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏమిటీ బ్యాటరీ ఫ్లెక్స్ ప్లాన్..?
Image Credit : Google

ఏమిటీ బ్యాటరీ ఫ్లెక్స్ ప్లాన్..?

ఈ ప్లాన్ 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (BaaS) పద్ధతిలో పనిచేస్తుంది. అంటే కస్టమర్లు ముందుగా బైక్ ఛాసిస్ ధర మాత్రమే చెల్లించి బండిని సొంతం చేసుకోవచ్చు. బ్యాటరీ కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో డబ్బు చెల్లించవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ నెలకు రూ.2,499 నుంచి మొదలవుతుంది. ఇది మనం సాధారణంగా నెల నెలా పెట్టే పెట్రోల్ ఖర్చు కంటే తక్కువేనని కంపెనీ చెబుతోంది.

35
ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్...
Image Credit : Google

ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్...

ఈ బ్యాటరీ ఫ్లెక్స్ ప్లాన్‌ను గ్రీన్ ఫైనాన్స్ సేవలు అందించే 'ఎకోఫై' (Ecofy) అనే NBFC సంస్థతో కలిసి అల్ట్రావయొలెట్ ప్రారంభించింది. ఈ ప్లాన్ వల్ల కస్టమర్లు పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌ను నడిపే అవకాశం పొందుతారు. బ్యాటరీ మెయింటెనెన్స్ లేదా మార్పు గురించి ఎలాంటి ఆందోళన లేకుండా బండిని వాడుకోవచ్చు.

45
బ్యాటరీ వారంటీ..?
Image Credit : Google

బ్యాటరీ వారంటీ..?

ఈ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో 5 ఏళ్ల వరకు బ్యాటరీ వారంటీ ఇస్తామని కంపెనీ తెలిపింది. అంతేకాదు సబ్‌స్క్రిప్షన్ సమయం పూర్తయ్యాక, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా బ్యాటరీ యాజమాన్యం నేరుగా కస్టమర్‌కే బదిలీ అవుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.

55
బుకింగ్స్ ప్రారంభం
Image Credit : Google

బుకింగ్స్ ప్రారంభం

బ్యాటరీ ఫ్లెక్స్ ప్లాన్ కోసం రిజిస్ట్రేషన్లు 2026 మార్చి 5 నుంచి ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు తక్కువ పెట్టుబడితో హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్యులకు మరింత చేరువ చేసే కీలక ప్రయత్నంగా ఈ ప్లాన్‌ను చూస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top Selling Cars: ఇండియాలో ఎక్కువగా నడిచే కార్లు ఏవి? ఎందుకు ఈ కార్లను ఎక్కువగా కొంటున్నారు?
Recommended image2
Tata Cars : కేవలం రూ.5.29 లక్షలకే కొత్త కారు.. మైలేజ్, ఫీచర్స్ గురించి తెెలిస్తే మైండ్ బ్లాక్
Recommended image3
EV Scooter : ఫోన్ లో కాదు ఇక స్కూటర్ డాష్ బోర్డులోనూ వాట్సాప్.. మార్కెట్‌ను షేక్ చేసే ఫీచర్లలో సరికొత్త ఈవి రెడీ
Related Stories
Recommended image1
Bike: ఈ బైక్ మైలేజ్ కింగ్‌.. ట్యాంక్ ఫుల్ చేస్తే 800 కి.మీలు వెళ్లొచ్చు. ధ‌ర రూ. 65 వేలే
Recommended image2
Long Drive EV Bike: ఈ బైక్‌ను 20 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 600 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved