ఇండియాలో సూపర్ బైక్ అనగానే గుర్తొచ్చే పేర్లలో ఒకటి డుకాటీ కంపెనీ. ఈ తయారీ సంస్థ పానిగేల్ వీ4 మోడల్ ని విపణిలోకి తీసుకొస్తోంది. ఇతర పాశ్చాత్య దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ మోటార్ సైకిల్ అత్యధికంగా అమ్ముడవుతోంది. భారత్లో విడుదల చేస్తన్న కొత్త వెర్షన్లో డాష్బోర్డ్, ఛాసిస్, ఎర్గోనామిక్స్, స్వింగార్మ్లో మార్పులు చేసి తాజాగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.