MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • Royal Enfield: అమ్మకాల్లో దూసుకుపోయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: యూత్ ఎగబడి కొంటున్నారు

Royal Enfield: అమ్మకాల్లో దూసుకుపోయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: యూత్ ఎగబడి కొంటున్నారు

Royal Enfield: యూత్ కి ఫేవరేట్ గా నిలిచి అమ్మకాల్లో రికార్డులు క్రియేట్ చేసింది రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో వృద్ధిని నమోదుచేసింది ఈ బైక్. హంటర్ 350 అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా కొనసాగుతోంది. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 31 2025, 11:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దేశవ్యాప్తంగా క్రేజ్
Image Credit : our own

దేశవ్యాప్తంగా క్రేజ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. 2025 ఏప్రిల్ నెల రాయల్ ఎన్‌ఫీల్డ్ కి కాస్త నిరాశనే మిగిల్చింది. ఎందుకంటే మార్చి నెల కంటే అమ్మకాలు 13.68% తగ్గాయి. అయితే గత ఏడాది ఏప్రిల్ తో పోలిస్తే 1.28% వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ లో 76,002 వాహనాలు అమ్ముడయ్యాయి. మార్చిలో 88,050 వాహనాలు అమ్ముడైన దానికంటే ఇది తక్కువే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యూత్ ఫేవరేట్ హంటర్
Image Credit : our own

యూత్ ఫేవరేట్ హంటర్

అయితే కొన్ని మోడల్స్ ఎప్పుడూ అమ్మకాల్లో ముందుంటాయి. అలా బాగా అమ్ముడైన ఒక బైక్ ఉంది. అదే హంటర్. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ అత్యంత చవకైన బైక్ కూడా ఇదే. 2022లో విడుదలైన హంటర్ యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా మార్కెట్ లోకి వచ్చింది. విడుదలైనప్పటి నుండి మంచి డిమాండ్ తో అమ్ముడవుతూ ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత చవకైన మోటార్ సైకిల్ హంటర్ 350. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.50 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

35
ఏప్రిల్ 2025 అమ్మకాలు
Image Credit : our own

ఏప్రిల్ 2025 అమ్మకాలు

ఏప్రిల్‌లో 18,109 హంటర్లు అమ్ముడయ్యాయి. మార్చిలో 16,958 అమ్మకాలతో పోలిస్తే 6.7% ఎక్కువ. 2024 ఏప్రిల్‌లో అమ్ముడైన 16,186 కంటే 11.8% ఎక్కువే. రెండవ అత్యధికంగా అమ్ముడైన బైక్ హంటర్ గా రికార్డుల్లో నిలిచింది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ క్లాసిక్. కంపెనీ అత్యధికంగా అమ్ముడైన బైక్ కూడా ఇదే. ఏప్రిల్‌లో 26,801 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ నెలవారీ అమ్మకాల్లో 9% కంటే ఎక్కువ తగ్గుదల కనిపించింది.

45
అత్యధికంగా అమ్ముడైన బైక్
Image Credit : our own

అత్యధికంగా అమ్ముడైన బైక్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 2025 మార్చిలో 33,115 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే వార్షిక అమ్మకాల్లో 29.82% వృద్ధిని నమోదు చేసింది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ పాత మోడల్ బుల్లెట్ 350, గత నెల 16,489 యూనిట్లు అమ్ముడై 25% వార్షిక వృద్ధిని సాధించింది. మార్చిలో 21,987 యూనిట్లు అమ్ముడైన దానికంటే ఇది 25% తక్కువ. 

55
రూ.1.75 లక్షలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ 350
Image Credit : our own

రూ.1.75 లక్షలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ 350

రాయల్ ఎన్‌ఫీల్డ్ రెండవ చవకైన మోటార్ సైకిల్ బుల్లెట్ 350. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.75 లక్షలు.

ప్రస్తుతం యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్ లోనూ మార్కెట్ లోకి రానున్నాయి. ఇప్పటికే ఎక్స్ పోలో కొన్ని మోడల్స్ ప్రదర్శించారు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image2
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Recommended image3
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Related Stories
Recommended image1
Yamaha Bikes: వామ్మో.. యమహా బైక్స్ పై రూ.లక్షకు పైగా డిస్కౌంటా? ఆఫర్ అదిరిపోయిందిగా..
Recommended image2
Royal Enfield new bikes: రాయల్​ ఎన్​ఫీల్డ్ నుంచి అదిరిపోయే కొత్త బైక్​లు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved