న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఎస్‌యూవీ డిస్కవరీ మోడల్‌లో 2019 వెర్షన్‌ను విపణిలోకి విడుదల చేసింది. ఈ మోడల్ కారు ధర  రూ.75.18 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 

కొత్త మోడల్‌ కారు నాలుగు వేరియంట్లలో లభించనుంది. 2.0 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను ఇందులో అమర్చారు. అధిక శక్తి కలిగిన ఇగ్నేషియం డీజిల్‌ వేరియంట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా డిస్కవరీ ప్రత్యేకత మరింత పెరుగుతుందని జేఎల్‌ఆర్‌ ఇండియా అధ్యక్షుడు, ఎండీ రోహిత్‌ సూరి పేర్కొన్నారు. 

ఆకర్షణీయ ధరను నిర్ణయించడంతో మరింత మంది వినియోగదారులను చేరతామని జేఎల్‌ఆర్‌ ఇండియా అధ్యక్షుడు, ఎండీ రోహిత్‌ సూరి  ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 డిస్కవరీ మోడ్‌లో ఎలక్ట్రికల్లీ రిక్లైనింగ్‌ సీట్లు, థర్డ్ రో సీట్లు, ఇంటెలిజెంట్‌ సీట్‌ ఫోల్డ్‌, వాతావరణ నియంత్రణ, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హై పవర్డ్ ఇగ్నీషియం డీజిల్ వేరియంట్ కారు ధర ఆకర్షణీయంగా ఉంటుంది. డిస్కవరీ మోడల్ కారుతో తన కస్టమర్ల బేస్‌ను జాగ్వార్ లాండ్ రోవర్ విస్తరిస్తుందని అంచనాలు ఉన్నాయి.