Asianet News TeluguAsianet News Telugu

వికారినామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు

తెలుగు సంవత్సరాదిలో వృశ్చికరాశి ఫలితాలు

telugu new year results.. vruchika rashi details are here
Author
Hyderabad, First Published Apr 5, 2019, 4:34 PM IST

వృశ్చికం : (విశాఖ 4 పా. అనూరాధ, జ్యేష్ఠ) : ఆదాయం - 14, వ్యయం- 14; రాజపూజ్యం - 3, అవమానం - 1;

          ఈ రాశివారికి నవంబర్‌ వరకు గురువు జన్మరాశిలో సంచరిస్తాడు. గురువు జన్మరాశిలో సంచరించడం వలన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదులు చేసుకునేవారికి ప్రమోషన్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. స్థాన చలనం తప్పనిసరిగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు రూపకల్పన చేసుకుటాంరు.

పట్టుదలతో కార్యసాధన చేస్తారు. నవంబర్‌ 2019 తరువాత ద్వితీయంలో గురు సంచారం వలన నిల్వ ధనం పెంచుకుటాంరు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. వాక్‌దానాలు నెరవేరుతాయి. మధ్యవర్తిత్వ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. శని ద్వితీయ సంచారం వలన జనవరి 2020 వరకు మాట విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి.

నవంబర్‌, డిసంబర్‌, జనవరి మూడు నెలలు మాట విషయంలో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబంలో గౌరవాన్ని తగ్గకుండా చూసుకోవాలి. వచ్చే సంవత్సరంలో తృతీయ సంచారం వలన సేవక జన జనసహకారం బాగా లభిస్తుంది. కావాలసిన పనులు పూర్తిచేసుకుటాంరు. ఆధ్యాత్మిక చిన్న చిన్న యాత్రలు పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. గౌరవం పెరుగుతుంది. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి.

రాహువు అష్టమ సంచారం వలన ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్స్‌ సందర్శనం అధికంగా ఉంటుంది. శ్రమలేని ఆదాయంపై ఊహలు ఉంటాయి. అనవసర ఖర్చులు అధికంగా చేస్తారు. కేతువు ద్వితీయ సంచారం వలన మాటల్లో నిరాశ నిస్పృహలు ఉంటాయి. మాటల వల్ల కుటుంబ సంబంధాలు దూరమయ్యే  పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించాలి. వీరు నిరంతరం శ్రీదత్తశ్శరణం మమ, విష్ణుసహస్రనామ పారాయణ చేసుకోవడం మంచిది.

గౌరవం తక్కువ అవమానాలు ఎక్కువగా ఉన్నరాశులు : మేషం, సింహం, కన్య, మకరం, మీనం

ఏకాత్మభావన : ఈశ్వరోగురురాత్మేతి మూర్తి త్రి త్రయ స్వరూపిణే ఆనందాత్మ స్వరూపాయ దక్షిణామూర్తయే నమః

ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉన్న రాశులు :  సింహం, ధనుస్సు, మీనం

గృహప్రాప్తి మంత్రం :  చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా, 

ఇల్లు కాకుండా స్థలం కొనుక్కుందామనుకుంటే

స్థల ప్రాప్తి మంత్రం : శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ, త్రివిక్రమాయ నమః,

దాన ధ్యానం : జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఈ జపాలు చేసుకుంటూ ఉండాలి.

డా.ఎస్.ప్రతిభ

ఇతర రాశుల వారి ఉగాది ఫలితాలు

మేషరాశి ఫలితాలు

వృషభరాశి ఫలితాలు

మిథునరాశిఫలితాలు

కర్కాటక రాశివారి ఫలితాలు

సింహరాశి ఫలితాలు

కన్యారాశి ఫలితాలు

తులరాశి ఫలితాలు

Follow Us:
Download App:
  • android
  • ios