వికారి నామ సంవత్సరం కన్యరాశి వారి ఫలితాలు
తెలుగు సంవత్సరాదిలో కన్యా రాశివారి ఫలితాలు ఇలా ఉన్నాయి
కన్య : (ఉత్తర 2,3,4 పా. హస్త, చిత్త 1,2 పా) : ఆదాయం - 11, వ్యయం - 5; రాజపూజ్యం - 4, అవమానం - 5;
ఈ రాశివారికి గురువు నవంబర్ 2019 వరకు తృతీయంలోను సంవత్సరాంతంలో చతుర్థంలో సంచారం ఉంటుంది. తమకంటే పెద్దవారి సహాయ సహకారాలు వీరు అందుకుటాంరు. పెద్దవారితో స్నేహ సంబంధాలు పెంచుకుటాంరు. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయస్తులతో సంతోషంగా కాలం గడుపుతారు. కమ్యూనికేషన్స్ కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం.
దగ్గరి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. వత్సరాంతంలో చతుర్థ సంచారం వలన అనుకోని ఖర్చులు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొటాంరు. విద్యార్థులకు కొంత శ్రమ, ఒత్తిడి ఉంటుంది. శని జనవరి 2020 వరకు చతుర్థంలో ఉంటాడు. చతుర్థ సంచారం వలన కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో జాగ్రత్త అవసరం. ఒత్తిడితో సౌకర్యాలను పూర్తిచేస్తారు. ధనాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తారు.
శని పంచమ సంచారం వలన సంతానం కోసం సమయాన్ని కేయిస్తారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సృజనాత్మకతను కోల్పోతారు. ఏ పనిచేసినా సొంత ఆలోచనలు చేయకూడదు. ఒకరి సలహా పాటిచడం మంచిది. రాహువు దశమంలో సంచారం వలన వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి కనిపిస్తుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. ఎంత అనుకూలత, అభివృద్ధి ఉన్నా వాటికి కొంత శ్రమ తప్పనిసరిగా తోడవుతుంది.
శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. కేతువు చతుర్థ సంచారం విద్యార్థులకు కష్టకాలం అవుతుంది. ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాలు వస్తాయి. గౌరవ నష్టం సూచితమౌతుంది. వీరు విష్ణుసహస్రనామ పారాయణ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.
ఏకాత్మభావన : ఈశ్వరోగురురాత్మేతి మూర్తి త్రి త్రయ స్వరూపిణే ఆనందాత్మ స్వరూపాయ దక్షిణామూర్తయే నమః
ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉన్న రాశులు : సింహం, ధనుస్సు, మీనం
గృహప్రాప్తి మంత్రం : చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా,
ఇల్లు కాకుండా స్థలం కొనుక్కుందామనుకుంటే
స్థల ప్రాప్తి మంత్రం : శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ, త్రివిక్రమాయ నమః,
దాన ధ్యానం : జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఈ జపాలు చేసుకుంటూ ఉండాలి.
డా.ఎస్.ప్రతిభ
ఇతర రాశుల వారి ఉగాది ఫలితాలు