వికారినామ సంవత్సరం.. మేషరాశివారి ఫలితాలు
తెలుగు సంవత్సరాదిలో మేషరాశివారికి ఇలా ఉండబోతోంది.
మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1పా) : ఆదాయం -14, వ్యయం -14; రాజపూజ్యం -3, అవమానం -6;
మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు గోచారరీత్యా నవంబర్ 4 వరకు అష్టమంలోను తరువాత సంవత్సరాంతం వరకు నవమంలో సంచరిస్తాడు. అష్టమంలో సంచరించడం వల్ల గౌరవలోపాలకు అవకాశం ఉంటుంది. చేసే అన్ని పనుల్లో పూర్వపుణ్యం అధికంగా ఖర్చుఅవుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలకోసం ఖర్చుచేయడం మంచిది. సంవత్సరాంతం నుండి గురువు నవమ సంచారం వల్ల ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.
పరిశోధకులు తమ పరిశోధనలను కొనసాగిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు, దూర ప్రయాణాలు చేస్తారు. 2020 జనవరి 24 వరకు శని నవమ సంచారం వల్ల కార్యనిర్వహణలో లోపాలు ఏర్పడతాయి. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. అంత తొందరగా లభించకపోవచ్చు. 24 జనవరి 2020 తర్వాత సొంత రాశి అయిన దశమంలో సంచారం వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.
అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేసే పనుల్లో కొంత నెమ్మదితనం ఉంటుంది. రాహువు తృతీయ సంచారం వలన సహకార లోపాలు ఉంటాయి. కమ్యూనికేషన్స్ అంత అనుకూలించవు. దగ్గరి ప్రయాణాల్లో లోపాలు ఉంటాయి. నవమంలో కేతు సంచారం ఆధ్యాత్మిక ప్రగతి కుంటు పడుతుంది. సంతృప్తి లోపాలకు అవకాశం. అనుకున్నంత తొందరగా పనులు పూర్తిచేయలేరు.
ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నందున వీరు మంచిపనులకై ఖర్చులు చేయడంమంచిది. దాచుకోవాలని చూస్తే ధనం నిల్వ ఉండదు. ఈ సంవత్సరం అంతా దైవ, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకై ఖర్చులు చేయడం మంచిది. వీరికి హరహర శంకర, జయజయశంకర, దుర్గాస్తోత్ర పారాయణలు శ్రేయస్సును కలిగిస్తాయి.
గృహప్రాప్తి మంత్రం : చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా,
ఇల్లు కాకుండా స్థలం కొనుక్కుందామనుకుంటే
స్థల ప్రాప్తి మంత్రం : శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ, త్రివిక్రమాయ నమః,
దాన ధ్యానం : జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఈ జపాలు చేసుకుంటూ ఉండాలి.