వికారినామ సంవత్సరం.. కర్కాటకరాశి వారి ఫలితాలు
తెలుగు సంవత్సరాది కర్కాటక రాశి ఫలితాలు
కర్కాటకం : (పునర్వసు 4 పా. పుష్యమి, ఆశ్లేష) : ఆదాయం - 5, వ్యయం - 5; రాజపూజ్యం - 5, అవమానం - 2;
ఈ రాశివారికి నవబర్ 4 వరకు గురువు పంచమంలోను తరువాత సంవత్సరాంతంలో గురువు షష్ఠంలో సంచారం ఉంటుంది. వీరికి సంతానం విషయంలో సంతోషం కలుగుతుంది. ఆలోచనలు అనుకూలిస్తాయి. చేసే పనుల్లో ఉత్సాహం, క్రియేటివిటీ పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకుటాంరు. కళాకారులకు అనుకూల సమయం.
విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. నవంబర్ 4 తరువాత అనవసర ఒత్తిడులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. శారీరక బలం పెరుగుతుంది. పట్టుదలతో పనులు సాధిస్తారు. 2020 జనవరి24 వరకు శని షష్ఠంలో తరువాత సప్తమంలో సంచారం ఉంటుంది. వీరు పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు.
గౌరవం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. రాహువు వ్యయంలోను కేతువు షష్ఠంలో సంచారం చేస్తారు. రాహువు వలన అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం అధికంగా ఉంటుంది. సమయానికి తగిన విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది.
కొంత డబ్బు ఖర్చు అయినా విదేశాలకు వెళతారు. షష్ఠంలో కేతువు వలన పోటీ ల్లో శ్రమకు తగిన గుర్తింపు రాదు. నిరాశ, నిస్పృహలు పెరుగుతాయి. శారీరక, మానసిక ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. సంతృప్తి లోపిస్తుంది. వీరికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నందు వలన వీరు దానధర్మాలు అధికంగా చేసుకోవాలి. వీరు నిరంతరం దుర్గాస్తోత్రపారాయణలు, దుర్గాపారాయణం చేసుకోవడం మంచిది.
గౌరవం తక్కువ అవమానాలు ఎక్కువగా ఉన్నరాశులు : మేషం, సింహం, కన్య, మకరం, మీనం
ఏకాత్మభావన : ఈశ్వరోగురురాత్మేతి మూర్తి త్రి త్రయ స్వరూపిణే ఆనందాత్మ స్వరూపాయ దక్షిణామూర్తయే నమః
ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉన్న రాశులు : సింహం, ధనుస్సు, మీనం
గృహప్రాప్తి మంత్రం : చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా,
ఇల్లు కాకుండా స్థలం కొనుక్కుందామనుకుంటే
స్థల ప్రాప్తి మంత్రం : శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ, త్రివిక్రమాయ నమః,
దాన ధ్యానం : జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఈ జపాలు చేసుకుంటూ ఉండాలి.
డా.ఎస్.ప్రతిభ
ఇతర రాశుల వారి ఫలితాలు