ఆషాఢ శుద్ధ పూర్ణిమకు వ్యాసపూర్ణిమ అని పేరు.

దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం

బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం

నవగ్రహాలలో గురుగ్రహం ఒకి. దేవగురువు బృహస్పతి. గురు గ్రహానికి బృహస్పతి అని పేరు. సూర్యుడు నుండి 5వ గ్రహం గురుగ్రహం. ఇతర గ్రహాలకంటే దీని బరువు రెండున్నరెట్లు ఎక్కువ. ఆంగ్లంలో గురుగ్రహాన్ని జుపిటర్‌ అని అంారు. రోమన్‌ దేవతైన జుపిటర్‌ పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. గురుగ్రహం తన చుట్టూతాను తిరిగి రావడానికి 9గం.50 ని|| పడుతుంది. సూర్యునిచుట్టూ తిరిగి రావడానికి 11.86సం||. కాలం పడుతుంది. గురుగ్రహానికి 16 ఉపగ్రహాలున్నాయి. గురుగ్రహం పసుపుపచ్చగా కనిపిస్తుంటుంది.

గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు. గురువు శిష్యులలోని ఆజ్ఞానాంధకారాలను నిర్మూలించి జ్ఞానాన్ని, వెలుగును అందించేవాడు. పురాణాల ప్రకారం దేవతల గురువు బృహస్పతి. సప్త ఋషులలో అంగీరస పుత్రుడు బృహస్పతి. బాల్యంలోనే మహా పండితుడు. బుద్ధిమంతుడు అయ్యాడు. వేదాలను కూలంకశంగా అధ్యయనం చేసి, శాస్త్రాలను లోతుగా పరిశీలించి, రూప, గుణ, శీలంతో ప్రకాశించాడు.

పరమేశ్వరుడైన శివుని ఆరాధించి అతడిని ప్రసన్నం చేసుకున్నాడు. పరమపావనమైన కాశిలో శివలింగ ప్రతిష్ఠ చేసి ఘోర తపస్సుచేసి, శివుని అనుగ్రహాన్ని పొందాడు. గురువారం బృహస్పతిని స్మరిస్తూ నామకరణ: చేయబడింది. మానవుల ప్రవర్తనను నిర్దారించే నవగ్రహాలలో బృహస్పతి ఒకి. ఇతనికి వాచస్పతి అని మరొక పేరు కూడా ఉంది. కొన్ని వేదము ఋక్కులలో బృహస్పతిని అగ్ని అని భావించారు. గురువు - యజమానులకు పురోహితుడు. దేవతలకు గురువు. గురువు గుణాలకు అతీతుడు. గురియై గురువు. ప్రకృతిలో కనిపించే ప్రతి అంశము మనకు గురువు.

గురువు లేకుండా ఏ విద్య రాణించదని శాస్త్రవచనం. అయోమయ స్థితిలో ఉన్న మనకు ఆనందం మన అంతరాత్మలోనే ఉందని గుర్తు చేసే మహాత్ముడే గురువు. మనం ఏ రంగంలోనైనా రాణించాలంటే, అనుకున్నది సాధించాలంటే ఉన్నతంగా ఎదగాలంటే గురువు మార్గదర్శకత్వంలో శిక్షణ అత్యంత అవసరం. నిత్యానిత్యాలను వివరించి వివేకజ్యోతిని వెలిగించి ప్రగతి పథంలో నడిపించేవాడు గురువు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అన్నారు. గీతాచార్యుడైన శ్రీకృష్ణభగవానుడు మనకు ఎన్నో విషయాలను బోధించాడు. వాిని ఆచరించి జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

గురుగ్రహ అనుకూలతకు : మనం తలపెట్టిన కార్యాల్లో గురుగ్రహం అనుకూలించాలంటే

దానం - శనగలు; జపం - 16 వేలు గురుధ్యాన శ్లోకం; ఆరాధించ వలసినదేవం - గురుదక్షిణామూర్తి, దత్తాత్రేయ, విష్ణువు, వస్త్రం - పసుపు, హోమం - రవి సమిథలలో హోమం చేయాలి; రత్నం - పుష్యరాగం, రుద్రాక్ష - పంచముఖి,  రుద్రాక్ష శుభఫలదాయకం.

పూజ, జప, హోమ, దాన, రత్నధారణ, ఆధ్యాత్మిక, చింతన ద్వారా గురుబలాన్ని పెంచుకొని, గురుగ్రహ అనుగ్రహాన్ని పొందండి. వేదాల్లో పురాణాల్లో శాస్త్రాల్లో వర్ణించిన గురుతత్వాన్ని అన్వేషించి, ఆరాధించి, ఆనందాన్ని, ఆదాయాన్ని, అభివృద్ధిని పొందుదాం.

ఈ రోజు వీలైనంత వరకు దక్షిణామూర్తి ఆరాధన చేయడం, దత్తాత్రేయ ఆరాధన చేయడం మంచిది. శ్రీ హయగ్రీవాయ నమః జపం చేసుకోవడం కూడా మంచిదే. విద్యార్థులు, చదువుకునే వారందరూ ఈ జపం నిరంతరం చేసుకోవాలి. ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం కారణంగా జ్ఞానం కావాలనుకునేవారు శ్రీ హయగ్రీవాయనమః అనే జపాన్ని గ్రహణ సమయంలో చేసుకోవడం మంచిది. అందరికీ గురువు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ.....

డా.ఎస్.ప్రతిభ