జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు కొన్ని వస్తువులు కొనడం మంచిది కాదట. దానివల్ల నష్టాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి శనివారం రోజు ఏవి కొనకూడదు? ఏవి కొనచ్చు? ఇతర విషయాలు మీకోసం. ఓసారి తెలుసుకోండి.  

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని రోజుల్లో కొన్ని పనులు చేయడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. చాలామంది దీన్ని నమ్ముతారు. పాటిస్తారు కూడా. జ్యోతిష్యం ప్రకారం శనివారం నాడు కొన్ని పనులు అస్సలు చేయకూడదట. మరి శనివారం ఏం చేస్తే మంచిది? ఏం చేస్తే నష్టం కలుగుతుంది? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతి వారం ఏదో ఒకటి కొంటే అదృష్టం, శుభం కలుగుతాయని నమ్మకం. అలాగే కొన్ని వస్తువులు కొన్ని రోజుల్లో కొంటే మంచి ఫలితం ఉంటుందట. శనివారం నాడు ఈ వస్తువులు కొనకూడదని శాస్త్రం చెబుతోంది. అవేంటంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారంనాడు ఏం కొనకూడదు?

ఇనుప వస్తువులు

శనివారం ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు. ఇనుము శని గ్రహానికి సంబంధించింది. ఇనుప వస్తువులు ఆ రోజు కొనకపోవడమే మంచిది. కానీ ఇనుప వస్తువులు దానం చేస్తే అప్పులు తీరుతాయని నమ్మకం. అప్పులు తీరాలంటే శనివారం ఇనుప వస్తువులు దానం చేయచ్చు.

నూనెలు

శనివారం నూనె కొనకూడదని శాస్త్రం చెబుతోంది. శనివారం తలకు నూనె పెట్టుకొని స్నానం చేస్తే దోషాలు పోతాయి. కానీ నూనె కొనడానికి శనివారం మంచి రోజు కాదు. ఇంటిని శుభ్రం చేసే వస్తువులు కూడా శనివారం కొనకూడదు.

ఉప్పు

ఉప్పుని ఎప్పుడూ శనివారం కొనకండి. శుక్రవారం కొనడం మంచిది. శనివారం ఉప్పు కొంటే వ్యాపారంలో నష్టాలు వస్తాయి. శుక్రవారం ఉప్పు కొని పూజ గదిలో పెట్టుకోవడం మంచిది. ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. అందుకే శుక్రవారం మాత్రమే కొనాలి.

చెప్పులు

శనివారం చెప్పులు దానం చేస్తే శని దోషాలు పోతాయి. కానీ ఆ రోజు చెప్పులు బహుమతిగా తీసుకోకూడదు. ఆ రోజు ఎవరినీ అవమానించకూడదు.

ప్రయాణం

శాస్త్రం ప్రకారం శనివారం తూర్పు, ఉత్తర దిక్కుల్లో ప్రయాణం చేయకపోవడమే మంచిది. అత్యవసరమైతే తప్పా.. ఆ దిక్కుల్లో ప్రయాణం వాయిదా వేసుకోవాలి. 

శనివారం నువ్వుల నూనె దీపం పెడితే శని దేవుడు సంతోషిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కానీ ఆ రోజు నువ్వుల నూనె కొనకూడదట. ఇంట్లో ఉన్న నూనెనే వాడాలట.