జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 6న బుధుడు తన సొంత రాశి అయిన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి రాశి మార్పు 5 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఆ రాశులెంటో.. అందులో మీ రాశి ఉందో చెక్ చేసుకోండి.
హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 6న ఏకాదశి వస్తోంది. ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ప్రత్యేకమైన రోజు. ఈ శుభ దినాన.. విష్ణువు ప్రతినిధిగా భావించే బుధుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచరిస్తాడు. అందుకే ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారికి బుధుడి రాశి మార్పు అదృష్ట యోగాన్ని తీసుకురానుందో ఇక్కడ చూద్దాం.
మిథున రాశిలో బుధుడి సంచార ఫలితాలు
వృషభ రాశి
మిథున రాశిలో బుధుడి సంచారం.. వృషభ రాశి వారికి శుభ ఫలితాలనిస్తుంది. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఊహించని ధన లాభం కలుగుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పాత పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ సమయం కలిసివస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి. ఇంటర్వ్యూలు, ప్రెజెంటేషన్స్ లాంటి వాటిలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది.
కన్య రాశి
కన్య రాశి వారికి బుధుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ధైర్యం పెరుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. పాత అప్పులు తీరుతాయి. ఆస్తి లేదా ఇంటికి సంబంధించి శుభవార్తలు వింటారు.
తుల రాశి
తుల రాశి వారికి బుధుడి రాశి మార్పు అదృష్టాన్ని తెస్తుంది. విదేశాల నుంచి డబ్బు లేదా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం లేదా విదేశీ కంపెనీలకు సంబంధించిన అవకాశాలను వదులుకోవద్దు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి బుధుడి సంచారం వల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ప్రమోషన్ లేదా మంచి పదవి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పై అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించండి. మీ ప్రణాళికలను అమలు చేయడానికి ఇది మంచి సమయం.
