Zodiac Signs: గురు అస్తమయం.. నెల రోజులపాటు ఈ 3 రాశులకు తిరుగే లేదు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం త్వరలో అస్తమించనుంది. సాధారణంగా గురువు అస్తమయం శుభప్రదం కాదు. ఈ సమయంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు చేయరు. కానీ గురు అస్తమయం కూడా కొన్ని రాశులకు మంచి ఫలితాలు ఇవ్వనుంది. మరి ఆ రాశులెంటో ఓసారి చూద్దామా..

గురు గ్రహ అస్తమయం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం జూన్ 9న అస్తమించనుంది. తిరిగి జూలై 9న ఉదయిస్తుంది. నెల రోజుల పాటు గురు గ్రహం అస్తమయంలో ఉంటుంది. ఈ సమయంలో వివాహాలు, శుభకార్యాలు చేయరు. గురువు ఉదయించిన తర్వాతే మళ్లీ శుభకార్యాలు ప్రారంభమవుతాయి. అయితే గురువు అస్తమయం శుభప్రదం కానప్పటికీ… కొన్ని రాశులకు మేలు జరగనుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారాల్లో కొన్ని రాశులవారికి లాభాలు రానున్నాయి. ఆ రాశులెంటో ఇక్కడ చూద్దాం.
మేష రాశి
గురు అస్తమయం.. మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. పాత పరిచయాలు లేదా స్నేహితుల ద్వారా ఊహించని లాభాలు ఉంటాయి. మీ సామర్థ్యాలను నమ్ముకుంటూ ముందుకు సాగండి. నాయకత్వ లక్షణాలు.. గౌరవం, ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గురు అస్తమయం శుభప్రదం. అంతర్ దృష్టి బలంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, పదోన్నతి, జీతం పెరుగుదల ఉంటుంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు, విదేశీ సంబంధాల ద్వారా లాభాలు వస్తాయి. భవిష్యత్ ప్రణాళికను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది.
తుల రాశి
ఈ నెల రోజులు తుల రాశి వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. కళలు, ఫ్యాషన్, డిజైన్, మీడియా, న్యాయ రంగాల వారు విజయాలు సాధిస్తారు. గురు అస్తమయం వల్ల జీవితంలో ప్రశాంతత ఉంటుంది. చేసే పనిపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి విజయాలు సాధిస్తారు. పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. మీ తెలివితేటలతో కష్టమైన పరిస్థితుల నుంచి కూడా ఈజీగా బయటపడతారు.