జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, శ్రేయస్సు, జ్ఞానం అందించే గురు గ్రహం ప్రస్తుతం అస్తమయంలో ఉంది. జూలై 9న ఉదయిస్తుంది. అయితే గురు ఉదయం కొన్ని రాశుల వారికి మేలు చేస్తుందట. వారు పట్టిందల్లా బంగారం అవుతుందట. మరి ఆ రాశులేంటో చూద్దామా.. 

జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. గురువును జ్ఞానం, ధర్మం, సంపద, శ్రేయస్సు, అదృష్టం, హోదాలకు కారకుడిగా భావిస్తారు. గురు గ్రహం జూన్ 9 న అస్తమించిన విషయం తెలిసిందే. తిరిగి జూలై 9 ఉదయం 04:44కి ఉదయిస్తాడు. హిందూమత విశ్వాసాల ప్రకారం గురువు అస్తమయంలో ఉన్న కాలంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. గురువు ఉదయించినప్పుడు దాని సానుకూల ప్రభావం కొన్ని రాశులవారి జీవితంలో కొత్త అవకాశాలు, పురోగతిని తెస్తుంది. మరి ఆ రాశులేంటో వారికి కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం.

గురు ఉదయం వల్ల ప్రయోజనాలు పొందే రాశులు

వృషభ రాశివారిపై గురు ప్రభావం

వృషభ రాశివారికి గురు ఉదయం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో మీ ప్రయత్నాలకు ప్రశంసలు లభిస్తాయి. ఉన్నత హోదా పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం లేదా పదోన్నతి కోసం ఎదురు చూస్తుంటే ఇదే మీకు మంచి సమయం. మీరు ఆశించినవి దక్కుతాయి. అన్ని వైపుల ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో గౌరవం పెరుగుతుంది. సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు.

సింహ రాశివారిపై గురు ప్రభావం

సింహ రాశి వారికి గురు ఉదయం జీవితంలో కొత్త వెలుగు తీసుకువస్తుంది. మీ నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చెేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశీ ప్రయాణం లేదా ఉన్నత విద్యకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. 

తుల రాశివారిపై గురు ప్రభావం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తుల రాశి వారికి గురు ఉదయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా విద్య, రచన, న్యాయ రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. బంధువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. 

మకర రాశివారిపై గురు ప్రభావం

మకర రాశి వారికి గురు ఉదయం వల్ల అదృష్టం కలిసివస్తుంది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఇవి భవిష్యత్తులో పురోగతికి దారితీస్తాయి. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషం, శాంతి ఉంటుంది. అప్పులు తీరుతాయి. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. 

మీన రాశివారిపై గురు ప్రభావం

మీన రాశివారిపై గురు దృష్టి చాలా శుభప్రదం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధార్మిక యాత్ర చేసే అవకాశం ఉంది. జీవితంలో ప్రశాంతత, సమతుల్యత అనుభూతి చెందుతారు.