డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

నరదృష్టి మరియు వాస్తు దోషం సాధారణంగా ఎక్కువమంది  ఎదుర్కొనే  సమస్యలు దీనికి  అనేక  రకాలైన  నివారణ  మార్గాలు మన పెద్దలు చెబుతుంటారు. అవి ఏమిటో చూద్దాం.   

* నరదృష్టి నివారణకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో రోజు పూజ చేయడం. ప్రధాన గుమ్మం పైన ఏర్పాటు చేసుకోవాలి. ఇంకో చిట్కా ఏమిటంటే కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది గడపకు ఇరువైపులా పెడితే మంచిది. అదీ మంగళవారం పూట ఇలా చేస్తే నరదృష్టి లోపాలుండవు.

ఇండ్లల్లో, వ్యాపార సంస్థలలో గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. 

పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం  అభివృద్ధి కలుగుతుంది. రుణబాధలుంటే.. వినాయకస్వామి ఆలయంలో గరికతో పూజ చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి కాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి.

* వాస్తు దోషం

అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యా ప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడటం, అవమానాలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు.

దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మవ్యాధులు, ఉద్యోగం లభించక పోవడం మొదలగునవి. అదే విధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింట కష్టాలు, భర్త బలవంతంచే పుట్టినింటి వారిని పీడించడం మొదలగునవి అన్నీ వాస్తు దోషాలలోకి  వస్తాయి. 

వాస్తు దోష నివారణకు ఆయా ఇంటిని అనుభవజ్ఞులైన పండితులు చూస్తే గాని అసలు విషయం బయట పడదు. ఆ తర్వాతనే తగు సూచనలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

మహా సుదర్శన - లక్ష్మి నారసింహ హోమాన్ని కనీసం సంవత్సంలో ఒక్క సారైననూ ఇంట్లో, వ్యాపార  స్థలములులో జరిపించు కోవడం ఉత్తమం.   తద్వారా నరదృష్టి  ప్రభావం నుండి వాస్తు దోషములు  నుండి  ఉపశమనం లభిస్తుంది.  

ప్రతి రోజు ఇంటి ప్రధాన గుమ్మం శుద్ధిగా కడిగి పసుపు గడపకు పూసి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. రోజు ఇంట్లో పూజా మందిరంలో దీప, దూప, నైవేద్యాలు పెడుతూ ఉండాలి.  

ప్రతి హిందువు ఇంట్లో సంవత్సరంలో ఒక్క సారి ఇంటికి సున్నాలు వేయించుకుని శ్రీమద్వి విరాట్ విశ్వకర్మ భగవానుని వ్రత కధ లేదా పూజ, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతకధ జరిపించు కోవాలి. ఇలా చేస్తే సర్వత్ర శుభకరంగా ఉంటుంది.