గుండ్రని ముఖం, లోతైన కళ్ళు, ముతక అయిన తల వెంట్రుకలు, సన్నని బలహీనమైన దేహం కలిగి ఉంటారు. ఇతరుల ఆదరణ, పలుకుబడి పొందడానికి తగిన మార్గాలను అనుసరించి దినదినాభివృద్ధి పొందడం, అన్ని విషయాల్లో ముందంజ వేయడం, తమ వ్యవహారాల్లోగాని చేసే వృత్తుల్లోగాని చక్కని చాకచక్యంతో ప్రవర్తించడం, ధన సంబంధ విషయాల్లో అతి జాగ్రత్తగా ఉంటారు. కొంత పిసినారిగా ఉంటారు. వీరు సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మొండి పట్టుదలతో సేవా ధర్మాన్ని కలిగి, తనకు ఎంత ఇబ్బంది కలిగినా, పని చేసి చూపించే తత్త్వం కలవారు. తాము ఉన్న స్థానంలో ఎక్కువ బలం కలిగి ఉంటారు. అంటే స్వంత ప్రదేశంలో ఎక్కువగా ఎదుగుతారు. సమాజంలో గౌరవం కావాలని ఆరాటపడతారు. అది వీరికి లభిస్తుంది కూడా.

 

అన్ని రకాల సేవలు చేయడానికి వీరు ముందుకు వచ్చినా ఒక్కో చేయించుకునే వారు లభించరు. సమాజంలో గౌరవం కోల్పోతున్నామని భయపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇదే సహజ దశమ స్థానమై అది అనుకూలంగా లేకపోతే ఈవిధంగా ఆలోచనలు వస్తాయి. ఉదా : సరియైన ఉద్యోగం నాకు లేదు - పై అధికారుల వల్ల సమస్యలున్నాయి - సమాజంలో నాకు తగినంత గౌరవం లేదు - సామాజిక మైన హోదా తగ్గిపోతుంది - తండ్రితో ఇబ్బందులు పడుతున్నాను - ప్రమోషన్స్‌ రావడం లేదు వంటి ప్రశ్నలు దశమ భావానికి సంబంధించిన లోపాలను సూచించే సాధారణమైన ప్రశ్నలు.

 

దశమాధిపతి షష్ఠాష్ట వ్యయాలలో ఉండడం, దశమంలో త్రికస్థానాధిపతులుండడం, దశమం, దశమాధిపతితో త్రికస్థానాధిపతులు, అశుభగ్రహాల సంబంధాలు ఉండడం, దశమంలో సర్వాష్టక వర్గులో 24 కన్నా తక్కువ బిందువులు ఉండడం, దశమంలో భిన్నాష్టక వర్గులో 4 కన్నా తక్కువ బిందువులు ఉండడం వల్ల దశమభావ లోపాలకు జాతకరీత్యా అవకాశాలుంటాయి.

 

మరొకరి గొప్పతనాన్ని అంగీకరించకపోవడం, ఏ విధంగానైనా ఎదుటివారి గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం, తండ్రిని ద్వేషించడం, అధికారం కోసం ప్రక్కవాణ్ని ఏ రూపంలోనైనా ఇబ్బంది పెట్టే యత్నం, లేనిపోని అధికారాన్ని చెలాయించడం, అవమానాలకు అందరినీ గురి చేస్తూ తాను సంతోష పడడం వంటి పూర్వకర్మల వల్ల ప్రస్తుతం ఇటువంటి జీవనానికి అవకాశం ఉంటుంది.

 

అందరినీ గౌరవించడం, అందరిలోని పరమాత్మకు నిరంతరం నమస్కరించ గలగడం, ప్రేమతో అందరితో మెలగడం, ఎవరినీ అవమానించక పోవడం, పొరపాట్లు ఏమైనా జరిగితే వెంటనే సవరించుకునే ప్రయత్నం, నిత్యం పితరులకు నమస్కరించడం, వారి కోసం తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వారి మరణానంతరం వారి కోసం తగిన దానధర్మాలు చేయడం వంటి కార్యక్రమాల వల్ల దశమభావ పరమైన లోపాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

 

పరమాత్మ ఉన్నతుడు, అతనితో చేరిన ఈ శరీరమూ అత్యున్నతమైనదే, పొందిన ఈ శరీరంతో నిరంతరం లోకానికి మేలు చేసే భావనలు పొందాలి. ప్రకృతి అత్యంత ఉన్నతమైనది, పంచభూతాలన్నీ సమాజానికి అత్యున్నతమైన సేవ చేస్తున్నాయి, నేను ఆనందాత్మ స్వరూపాన్ని, అత్యున్నతునికి సంబంధించిన వానిని, అందరూ నావారే, నాలాంటి వారే అనే భావనలను పొందడం ద్వారా ఈ లోపాలను అధిగమించే అవకాశమున్నది.

 

జాతకత్వంలోని ఆటు పోట్లు తెలుసుకుని గమ్యంవైపు ఆలోచనలు సాగిస్తూ తమతోపాటు పదిమందిని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి.

డా.ప్రతిభ

ఇవి కూడా చదవండి

ధనస్సు రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

వృశ్చికరాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

తుల రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

కన్య రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

జ్యోతిష్యం.. సింహ రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. కర్కాటక రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. మిథునరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. వృషభరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?