పై భాగం ఎక్కువ, క్రిందిభాగం తక్కువ, వయస్సు పెరిగే కొద్ది లావుగా ఉంటారు. వీరిది విశాలమైన ముఖం కలిగి ఉంటారు. వీరికి జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అప్పుడే కోపం, అప్పుడే శాంతం వస్తూ ఉంటుంది. తమ గొప్పలు చెప్పుకోవాలనే ఆలోచన, సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఎదుటివారిపై ప్రేమ, దయ కలిగి ఉంటారు. అందరితో కలిసిపోతూఉంటారు. వీరికి కాస్త భయం అధికంగానే ఉంటుంది.

ఎవరి తోడూ లేకపోతే ఏ పని చేయలేరు. గొప్పలు మాత్రం చెప్పుకుంటారు. కళలలో మంచి రాణింపు ఉంటుంది. ఎదుటివారి సహకారంతో పనులు చేసినా ఎక్కడో ఒకచోట తన ప్రత్యేకతను చెప్పుకుంటారు. అందరినీ మెప్పించే తత్త్వం కలవారు. ఎదుటివారి ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది. స్వతంత్రమైన నిర్ణయాలు ఎక్కువగా తీసుకోరు. చిన్నచిన్న అలజడులకే భయపడిపోతూ ఉంటారు.

తమకు ఆపద వచ్చిందంటే అందరూ తమని గమనించి ఉండాలని కోరుకుంటారు. తమ మాట ఎదుటివారు సరిగా వినకపోతే ఆ భావన లోలోపల పెట్టుకుని కుమిలిపోతూ అనారోగ్యం పాలవుతారు. వీరికి కావలసిన సౌకర్యాలలో ఏ మాత్రం చిన్న లోపం వచ్చినా తట్టుకోలేరు. బాగా భయానికి లోనౌతారు. అన్నీ అనుకూలంగా ఉంటే సరి. ఏ మాత్రం తమకు కావలసిన విషయాలలో లోపం వచ్చిన వెంటనే బాధపడతారు. ఏదో ఆలోచిస్తూ ఉంటారు కర్కాటకం సహజ చతుర్థమై ఆ భావంలో పాప గ్రహాల యుతి ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఉదా : శరీరానికి తగిన సుఖం లేదు - ఆహార విహారాల్లో అనుకూలత లేదు - గృహ నిర్మాణం చేయలే పోతున్నాను - వాహనం ఎప్పటికీ అసౌకర్యంగా ఉంటుంది
- విద్యాదుల కోసం తగిన కృషి లేదు - మాతృసౌఖ్యం లేదు మొదలైనవి చతుర్థభావ లోపం వల్ల కలిగే భావనలు.

చతుర్థాధిపతి 6,8,12 స్థానాల్లో ఉన్నా, చతుర్థంలో 6,8,12 స్థానాధిపతులున్నా, నైసర్గిక అశుభగ్రహాలు చతుర్థంలో ఉన్నా,చతుర్థాధిపతి నీచ, అస్తంగత, శత్రు స్థానాల్లో ఉన్నా, చతుర్థాధిపతి త్రికస్థానాధిపతులతో కలిసి ఉన్నా, అష్టకవర్గులో చతుర్థ స్థానంలో 24 కంటే తక్కువ బిందువులున్నా, వేరు వేరు గ్రహాలు భిన్నాష్టక వర్గులో 4 కన్నా తక్కువ బిందువులను చతుర్థంలో ఇచ్చినా పై లోప భావనలకు అవకాశం అధికంగా ఉంటుంది.

అత్యధికమైన సౌఖ్యాలను ఇతరులకు అందకుండా తామే పొందడం, శరీరాన్ని అధర్మ కార్యాలకు అధికంగా వినియోగించడం, విద్యను దుర్వినియోగం చేయడం - తల్లిని దూషించడం, వ్యతిరేకించడం, శరీరం పరమాత్మకు వాహనం, దేవాలయం వంటిదనే విషయాన్ని మరచి ఇష్టం వచ్చినట్లుగా ఆహారం స్వీకరించడం, పరిధిలేని విహారాలను అనుభవించడం వంటి పూర్వకర్మలు ప్రస్తుత చతుర్థ భావ లోపాలకు కారణాలవుతాయి.

తాము పొందలేని సౌఖ్యం, చాలామందికి కలిగేందుకు కావలసిన ఆర్థిక సహకారాలను అందించడం, అందరికీ అన్నపానీయాదులు అందించడానికి ప్రయత్నం చేయడం, గృహ వాహనాదులు తీసుకునే వారికి తమ వంతు సహకారాన్ని అందించడం, నిత్యం మాతృపూజ చేయడం, అందరిలోనూ మాతృభావన పొందడం వంటి వాని వల్ల దోష ప్రాయశ్చితమౌతుంది.

ఈ శరీరం సర్వసౌఖ్యాలకు నిలయమైనదనీ, ఒక పరిపూర్ణమైన వ్యవస్థ తమ శరీరమనే గృహంలో ఉన్నదనీ, దానిలో సౌఖ్యం అనంతంగా ఉన్నదనీ, ఈ శరీరమనే వాహనంతో జీవన యానాన్ని ఆనందంగా చేయవచ్చుననే భావాన్ని పెంచుకోవాలి. శరీర పోషణకు కావలసిన ఆహారం కూడా ప్రసాద భావనతో స్వీకరించే విధానం పొందడం ద్వారా చతుర్థ భావ దోషాలకు సంబంధించిన లోపాలు క్రమంగా నివారణ జరుగుతాయి.

పక్కవారిని చూసి తనకు ఆ సౌకర్యాలు లేవనే ఆలోచనను తగ్గించుకుని ఉన్నదాంట్లో సంతృప్తి పడేటట్లు చూసుకోవాలి. తమకు ఉన్న ఈ చిన్ని జీవితాన్ని ధర్మకార్యాలకు వినియోగించాలి.

డా.ప్రతిభ

ఇవి కూడా చదవండి.

జ్యోతిష్యం.. మిథునరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. వృషభరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?