Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆర్థికంగా అనుకూలం.. అప్పుల నుంచి విముక్తి!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 8.12.2025 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
అప్పుల సమస్య వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.
వృషభ రాశి ఫలాలు
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
మిథున రాశి ఫలాలు
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. డబ్బు వ్యవహారాలు అంతగా కలిసిరావు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులుంటాయి.
కర్కాటక రాశి ఫలాలు
వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయటా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
సింహ రాశి ఫలాలు
ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి.
కన్య రాశి ఫలాలు
నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చూడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత అప్పులు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.
తుల రాశి ఫలాలు
ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
వృశ్చిక రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో ఊహించని విధంగా ఉంటాయి. ఇంటా బయటా ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. తండ్రి తరపు బంధువులతో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.
ధనుస్సు రాశి ఫలాలు
వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మకర రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ ప్రస్తావన వస్తుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. ఇతరుల అవసరానికి ఆర్థిక సహాయం చేస్తారు. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది.
కుంభ రాశి ఫలాలు
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.
మీన రాశి ఫలాలు
ఉద్యోగాలలో చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.

