MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Compatibility: ఈ రాశుల వాళ్లు ఆ రాశులను పెళ్లి చేసుకుంటే రోజూ గొడవలే

Zodiac Compatibility: ఈ రాశుల వాళ్లు ఆ రాశులను పెళ్లి చేసుకుంటే రోజూ గొడవలే

Zodiac Compatibility: పెళ్లిళ్లు చేసేటప్పుడు జాతకాలు కచ్చితంగా చూస్తారు. అలాగే రాశులను కూడా తెలుసుకుంటారు. కొన్ని రాశుల వారు… కొన్ని రాశుల వారిని పెళ్లి చేసుకుంటే ఆ భార్యా భర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆ రాశుల జతలు ఏవో తెలుసుకోండి.

3 Min read
Author : Haritha Chappa
Published : Feb 25 2026, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మేష, వృషభ రాశులు
Image Credit : Getty

మేష, వృషభ రాశులు

మేష రాశికి చెందిన వాళ్లు మీన,  కర్కాటక రాశుల వారిని పెళ్లి చేసుకోకూడదు.  మీన రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. మేష రాశి వారి మొండి స్వభావం వాళ్లకు ఇబ్బందిగా అనిపించవచ్చు. మేష రాశి వారి ముక్కుసూటి మాటలు కర్కాటక రాశి వారిని బాగా బాధపెడతాయి.

వృషభ, సింహ రాశుల జంట కలిసినా కూడా బోలెడు కష్టాలు తప్పవు. సింహ రాశి వారికి ఎక్కువ ప్రేమ కావాలి. కానీ వృషభ రాశి వాళ్లు అంతగా ఎవరినీ పట్టించుకోరు. సింహ రాశి వారు స్వేచ్ఛను ఇష్టపడితే, వృషభ రాశి వారు బంధాన్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. సింహ రాశి వారు బయట తిరగడానికి ఇష్టపడితే, వృషభ రాశి వారు ఇంట్లోనే ప్రైవసీ కోరుకుంటారు. కాబట్టి ఈ రాశుల వారు పెళ్లి చేసుకుంటే సరిపడదు.

26
మిథున, కర్కాటక రాశులు
Image Credit : Getty

మిథున, కర్కాటక రాశులు

మిథున రాశికి అస్సలు సెట్ అవ్వని రాశుల్లో వృశ్చికం మొదటిది. వృశ్చిక రాశి వారు బంధంలో చాలా డిమాండింగ్‌గా ఉంటారు, ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. వాళ్ల రహస్య స్వభావం, అతి ప్రేమతో మిథున రాశి వారికి ఊపిరాడనట్లు అనిపిస్తుంది. మిథున రాశి వారు బాగా మాట్లాడితే, వృశ్చిక రాశి వారు మౌనంగా ఉంటారు.

కర్కాటక రాశి వారికి కుంభ రాశి వాళ్లతో చాలా కష్టం. బంధం విషయానికి వస్తే ఇద్దరి మధ్య పొంతన ఉండదు. కర్కాటక రాశి వారికి బంధంలో భద్రత, స్థిరత్వం కావాలి. కానీ కుంభ రాశి వారికి స్వేచ్ఛ ఎక్కువ కావాలి. ఇది కర్కాటక రాశి వారిలో అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ రాశుల వారు మంచి జంట కాలేరు.

Related Articles

Related image1
Rashmika Mandanna: రష్మిక పాత ప్రియుడి గురించి అడిగితే విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా?
Related image2
Mercury Transit: బుధుడి వక్ర గమనం వల్ల, ఈ 3 రాశుల వారు ఆర్థికంగా దూసుకెళ్లిపోతారు
36
సింహ, కన్యా రాశులు
Image Credit : Getty

సింహ, కన్యా రాశులు

సింహ రాశి వారు మకర రాశి వారితో  బంధంలో ఉండలేరు. మకర రాశి వారు సంప్రదాయాన్ని ఇష్టపడతారు. కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడతారు. సింహ రాశి వారు పెద్ద మనసున్నవారే అయినా, ప్లానింగ్‌ ఉండదు. కాబట్టి ఈ రెండు రాశులకు ఏమాత్రం సరిపడదు.

కన్యా రాశి వారికి ధనుస్సు రాశి వారికి కూడ పడదు. ధనుస్సు రాశి వారి అజాగ్రత్త, సమయపాలన లేకపోవడం, ప్లానింగ్‌కు కట్టుబడి ఉండకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కన్యా రాశి వారు త్వరగా విసిగిపోతారు. వీళ్లిద్దరూ పూర్తి భిన్న స్వభావాలు కలిగి ఉంటారు.

46
తులా, వృశ్చిక రాశులు
Image Credit : Getty

తులా, వృశ్చిక రాశులు

తులా రాశి వారు సరదాగా, అందరితో కలిసిపోయేలా ఉంటుంది. కానీ వీరికి అస్సలు సెట్ అవ్వని రాశి కన్య. ఎందుకంటే కన్యా రాశి వారు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.  అది తులా రాశి వారికి ఊపిరాడనట్లు చేస్తుంది. తులా రాశి వారు సమయాన్ని వృథా చేస్తే, కన్యా రాశి వారు పర్ఫెక్షనిజం కోసం పాకులాడతారు.

వృశ్చిక రాశికి తులా రాశి అస్సలు సరిపోదు. వృశ్చిక రాశి వారు రహస్యంగా ఫ్లర్ట్ చేయగలరు. కానీ, తులా రాశి వారు అలా చేస్తే సహించలేరు. తులా రాశి వారు బయట తిరగడానికి ఇష్టపడితే, వృశ్చిక రాశి వారు గదిలో ఉండటానికి ఇష్టపడతారు. వీరి మధ్య పొంతన ఉండదు.

56
ధనుస్సు, మకర రాశులు
Image Credit : Getty

ధనుస్సు, మకర రాశులు

ధనుస్సు రాశి వారు ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. చాలా పాజిటివ్‌గా కనిపిస్తారు. కానీ వీరికి అస్సలు పడని రాశి వృషభం. ఎందుకంటే వాళ్ల ప్రాక్టికల్ లైఫ్‌స్టైల్ వల్ల, వాళ్లు అంత ఉత్సాహంగా ఉండరని, స్పాంటేనియస్‌గా ప్రవర్తించరని మీకు అనిపిస్తుంది.

మకర రాశి వారు నిజాయితీ, విశ్వాసం, ఆశయం ఉన్నవాళ్లు. మీ కలను సపోర్ట్ చేసే భాగస్వామిని కోరుకుంటారు. కానీ మీకు అస్సలు సెట్ అవ్వని రాశి మిథునం. ఎందుకంటే మిథున రాశి వాళ్లను మార్చడం చాలా కష్టం. వాళ్లకు మీరు బోర్ కొట్టొచ్చు.

66
కుంభ, మీన రాశులు
Image Credit : Getty

కుంభ, మీన రాశులు

కుంభ రాశి వాళ్లు వృశ్చిక రాశి వారి వల్ల గందరగోళానికి గురవుతారు. వాళ్లు తమలా ఆలోచించడం లేదని కోప్పడతారు. వీరిద్దరి మధ్య ఏ సంభాషణ మొదలైనా అది కోపంతోనే ముగుస్తుంది. కుంభ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటే, వృశ్చిక రాశి వారు వారిని కంట్రోల్ చేయాలని చూస్తారు.

మీన రాశి వారు పుట్టుకతోనే రొమాంటిక్, భావనలకు ఎక్కువ విలువిస్తారు. కానీ వీరికి అస్సలు పడని రాశి కన్య. ఎందుకంటే కన్యా రాశి వారు విమర్శనాత్మకంగా, చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. కానీ మీరు సున్నితంగా, కలలు కనే రకం. ఇద్దరి దారులు వేరు. అరుదుగా మాత్రమే ఈ రెండు రాశుల మధ్య మంచి బంధం ఏర్పడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Combust: శని అస్తమయం.. ఈ 4 రాశులవారికి రెట్టింపు అదృష్టం, ఆదాయం!
Recommended image2
Mercury Transit: బుధుడి వక్ర గమనం వల్ల, ఈ 3 రాశుల వారు ఆర్థికంగా దూసుకెళ్లిపోతారు
Recommended image3
Sun Moon Conjunction: సూర్య చంద్ర యుతి.. హోలీ తర్వాత ఈ రాశులకు టెన్షన్లు తప్పవు..!
Related Stories
Recommended image1
Rashmika Mandanna: రష్మిక పాత ప్రియుడి గురించి అడిగితే విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా?
Recommended image2
Mercury Transit: బుధుడి వక్ర గమనం వల్ల, ఈ 3 రాశుల వారు ఆర్థికంగా దూసుకెళ్లిపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved