విజయవాడ: తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై వంగవీటి రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చేశారు. కొంతకాలంగా వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీలో చేరే అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు వంగవీటి రాధా. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాధా స్పందించారు. బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువాకప్పుకోనున్నట్లు స్పష్టం చేశారు. టీడీపీకి తోడుగా ఉండాలన్నదే తన ధ్యేయమని తెలిపారు. 

పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలన్నదే తన తండ్రి వంగవీటి రంగా ఆకాంక్షఅని చెప్పుకొచ్చారు. పేదలకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారని చెప్పుకొచ్చారు. 

శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన చంద్రబాబు నాయుడుకు వంగవీటి రాధా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల భవిష్యత్ నియంతృత్వం కలిగిన వైఎస్ జగన్ లాంటి వ్యక్తుల నుంచి కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

పేద ప్రజల కోసం నిందలు మోయడానికి సిద్ధపడే అడుగులు వేస్తున్నాని తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు వంగవీటి రాధాకృష్ణ. ఇకపోతే వంగవీటి రాధాకృష్ణ మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మచిలీపట్నం ప్రస్తుత ఎంపీ కొనకళ్ల నారాయణ పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సమాచారం.  

ఈ వార్తలు కూడా చదవండి

వంగవీటి రాధాకు చెక్ పెట్టే యోచనలో వైసీపీ: సోదరుడు నరేంద్రకు గాలం

సైకిలెక్కనున్న వంగవీటి రాధా: చక్రం తిప్పిన లగడపాటి