హిందూపురం:  విధుల నుండి రిలీవ్ చేయాలని ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినా కూడ  పోలీసు శాఖ అమలు చేయడం లేదని హిందూపురం ఎంపీ సెగ్మెంట్ నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న గోరంట్ల మాధవ్ ఆరోపించారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా తనను విధుల నుండి రిలీవ్ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసినా కూడ కర్నూల్ రేంజ్ డీఐజీ తప్పించుకు తిరుగుతున్నాడని ఆయన ఆరోపించారు. రిలీవ్ చేయాల్సిన అధికారి తప్పించుకు తిరగడం సిగ్గు చేటన్నారు.

హిందూపురం ఎంపీ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్ధి గెలుపును సునాయాసం చేసేందుకే తనను రిలీవ్ చేయడం లేదని మాధవ్ ఆరోపించారు. పోలీసు అధికారులే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం సిగ్గు చేటన్నారు.

ఐపీఎస్ అధికారులు పార్టీల కోసం పని చేయకూడదని ఆయన కోరారు. ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు డైరెక్షన్‌లో కర్నూల్ రేంజ్ డీఐజీ పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఇంటలిజెన్స్ డీజీ, కర్నూల్ రేంజ్ డీఐజీల తీరును ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఆయన వివరించారు. పోలీసుల దురుద్దేశాలను కూడ ఈసీకి వివరించానని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌కు రిలీఫ్

గోరంట్ల మాధవ్‌కు ప్రభుత్వం షాక్: తెరపైకి కొత్త పేర్లు