అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ స్థానం నుండి  వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ కు కోర్టు తీపి కబురు అందించింది. మాధవ్ పోటీ చేసేందుకు వీలుగా విధుల నుండి రిలీవ్ చేయాలని ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అనంతపురం జిల్లాలో సీఐగా పని చేసిన గోరంట్ల మాధవ్ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ చేశారు. దీంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

ఈ ఏడాది జనవరి మాసంలో గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్‌కు ధరఖాస్తు చేసుకొన్నారు. అయితే ఇప్పటివరకు మాధవ్‌ను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. దీంతో మాధవ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.

ఈ విషయమై బుధవారం నాడు ఇరు వర్గాలు కోర్టులో వాదనలను విన్పించాయి.  90 రోజులకు ముందుగా వీఆర్ఎస్‌‌కు ధరఖాస్తు చేసుకోవాలని పోలీసుశాఖ వాదించింది. ఇద్దరి వాదనలను విన్న తర్వాత మాధవ్ పోటీ చేసేందుకు వీలుగా విధుల నుండి తప్పించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది

సంబంధిత వార్తలు

గోరంట్ల మాధవ్‌కు ప్రభుత్వం షాక్: తెరపైకి కొత్త పేర్లు