అమరావతి: సినిమా నటుడు... డైరెక్టర్ చెప్పినట్టుగానే నటిస్తాడు...వపన్ కళ్యాణ్ రాజకీయ సినిమాలో చంద్రబాబునాయుడు డైరెక్టర్‌ చేసినట్టుగానే పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.

సోమవారం నాడు ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు. డైరెక్టర్ చెప్పినట్టుగా నటించడమే నటుల పని అని ఆమె చెప్పారు. అదే తరహాలోనే పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ సినిమాలో నటిస్తున్నాడని ఆమె విమర్శించారు.

డేటా చోరీ విషయమై వైసీపీ ఇంతా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని  ఆమె డిమాండ్ చేశారు.పవన్ కళ్యాణ్ నామినేషన్లు వేసే సమయంలో పచ్చ జెండాలు కూడ కన్పించాయని ఆమె గుర్తు చేశారు. పైకి మాత్రం తమ మధ్య ఎలాంటి పొత్తులు లేవని చెబుతున్న ఈ పార్టీలు.... అంతర్గతంగా మాత్రం సర్ధుబాటు చేసుకొన్నాయని ఆమె విమర్శించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాము థర్డ్ పార్టీ ఎంక్వైరీని కోరితే పవన్  కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. జనసేనకు వేసే ఓట్లన్నీ టీడీపీకి వెళ్తాయని ఆమె తేల్చి చెప్పారు

సంబంధిత వార్తలు

వివేకా హత్య: చంద్రబాబుపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

జయంతికి, వర్థంతికి తేడా తెలియదు: లోకేష్‌పై షర్మిల సెటైర్లు

చంద్రబాబువి అన్నీ అబద్దపు హామీలే: వైఎస్ షర్మిల

చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు