హైదరాబాద్: అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబునాయుడు అబద్దపు వాగ్ధానాలను చేశారని వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆరోపించారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని  ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

సోమవారం నాడు ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు.అధికారంలోకి వచ్చేందుకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబునాయుడు నెరవేర్చలేదని ఆమె విమర్శించారు.87వేల కోట్ల రైతుల రుణ మాఫీని రూ. 24వేల కోట్లకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం కుదించిందని ఆమె ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీపై సంతకం పెట్టకుండా రుణమాఫీపై కమిటీ ఏర్పాటుపై సంతకం చేశారని ఆమె ఆరోపించారు.డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబునాయుడు నెరవేర్చలేదన్నారు. 

పసుపు కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెట్టేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేయలేమని మంత్రి పరిటాల సునీత చేసిన ప్రకటనను ఆమె గుర్తు చేశారు.

ఆడపిల్లలు పుడితే రూ.5 వేలు ఇస్తామని ఇచ్చారు. ఐదేళ్లలో పుట్టిన ఆడపిల్లలకు రూ. 25 వేలు ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు ట్యాబ్‌లు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేశారా అని ఆమె ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు