హైదరాబాద్: చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆరోపించారు.కానీ,  తన కొడుకు లోకేష్‌కు అర్హతలు లేకున్నా మూడు కీలకమైన మంత్రిత్వశాఖలను అప్పగించారని ఆమె విమర్శించారు.

సోమవారం నాడు ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో పప్పు ఉన్నారు కదా.. పప్పు ఓడిపోతే అంతకన్నా సంతోషం మరోటి ఉండదని లోకేష్‌పై షర్మిల వ్యంగ్యాస్త్రాలను సంధించారు.9వ తేదీన ఓటు వేయాలని కూడ  లోకేష్ కోరిన విషయాన్ని  ఓ మీడియా ప్రతినిధి గుర్తు చేస్తే ఆమె నవ్వుతూ... ఇలాంటి కామెడీ షో లేకపోతే రాజకీయాల్లో ఎంటర్‌టైన్ మెంట్ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.

బాబు వస్తే జాబ్ వస్తోందని టీడీపీ నేతలు ప్రచారం చేశారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత  ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు. ఎలాంటి అర్హతలు లేకున్నా లోకేష్‌కు మూడు కీలకమైన మంత్రిత్వశాఖలను ఇచ్చారని చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు ఐటీ శాఖను కట్టబెడితే లోకేష్‌కు కూడ ఐటీ శాఖను కట్టబెట్టారని చెప్పారు. అయితే తెలంగాణలో మాదిరిగా కేటీఆర్ తెచ్చినట్టుగా ఏపీలో ఐటీ పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తోందని ఊదరగొడితే తాము ఈ పరిశ్రమను అమరావతిలో ఏర్పాటు చేయడం లేదని ఆ కంపెనీ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
జయంతికి, వర్ధంతికి మధ్య కూడ లోకేష్‌కు తేడా తెలియదని ఆమె ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబువి అన్నీ అబద్దపు హామీలే: వైఎస్ షర్మిల

చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు