అమరావతి: ఎన్నికల కోడ్  ఉన్న సమయంలో  కూడ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహించడంపై సీఈసీ  సీరియస్ అయింది.ఈ విషయమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నుండి  సీఈసీ నివేదిక కోరింది.

 రెండు రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం నాడు సీఆర్‌డీఏ పనులపై సమీక్ష చేశారు. అదే రోజు సాయంత్రం పోలీసు శాఖపై సమీక్ష చేయాలని భావించారు. 

అయితే సీఎం సమీక్షలకు సంబంధించిన విషయమై ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అభ్యంతరం వ్యక్తం చేశారు. సమీక్షలు నిర్వహించడం సరైంది కాదన్నారు.ఈ విషయమై టీడీపీ, వైసీపీల మధ్య  మాటల యుద్దం సాగుతోంది.

ఇదిలా ఉంటే  ఏపీ సీఎం అధికారులతో సమీక్షలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని వివరణ కోరారు.

మరో వైపు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన జలవనరుల శాఖ, సీఆర్‌డీఏ శాఖాధికారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నోటీసులు పంపారు. 

సంబంధిత వార్తలు

మాకొచ్చే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లివే: తేల్చేసిన టీడీపీ నేత

మరో షాక్: చంద్రబాబు సమీక్షలపై ఈసీ బ్యాన్

గవర్నర్‌కు జగన్ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఆరా