అమరావతి: చంద్రబాబునాయుడు అపద్ధర్మ సీఎం కాదని ఎమ్మెల్సీ, టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఎన్నికల కమిషన్ అడ్డగోలుగా వ్యవహరిస్తోందని  ఆయన విమర్శించారు.

శుక్రవారం నాడు  ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. 2014 జూన్ 8వ తేదీన చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్ 7వ తేదీ వరకు సీఎంగా ఉంటారని ఆయన చెప్పారు.

పోలింగ్ తర్వాత  రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకూడదా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని పనుల విషయంలో ఎవరూ చూడాలని ఆయన ప్రశ్నించారు.

 జగన్ కేసులో ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా ఎలా నియమిస్తారో చెప్పాలని  ఆయన డిమాండ్ చేశారు.  పోలింగ్ తర్వాత ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం సరైంది కాదని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే ఈసీ నిబంధనలను మార్చుకోవాలని ఆయన సూచించారు.

జగన్ మరోసారి ఓటమి పాలు కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.  ఈ ఎన్నికల్లో తమకు 120 అసెంబ్లీ, 20 ఎంపీ సీట్లు వస్తాయని రాజేంద్రప్రసాద్ ధీమాను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

గవర్నర్‌కు జగన్ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఆరా

మరో షాక్: చంద్రబాబు సమీక్షలపై ఈసీ బ్యాన్