అమరావతి: ఏపీ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. సీఈసీ  ఆదేశాల మేరకు ఏపీలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది నివేదిక పంపారు.

పోలింగ్ రోజున ఆ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం రాష్ట్ర గవర్నర్‌ నరసింహాన్‌కు  వినతిపత్రం సమర్పించారు.

దీంతో కేంద్ర ఎన్నికల సంఘం  రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై  ఆరా తీసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని... ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. మరో వైపు  పోలింగ్ రోజున ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనతో ఏం మాట్లాడారనే విషయాన్ని ఇంగ్లీష్‌లో తర్జుమా చేసి నివేదిక పంపారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల తీరుపై డీజీపీ ఇచ్చిన నివేదికనే సీఈఓ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారని సమాచారం. కలెక్టర్ల నివేదికల ఆధారంగానే తాను పోలింగ్‌పై నివేదికను అందించినట్టుగా ద్వివేది చెప్పారు. మరోసారి జిల్లాల కలెక్టర్ల నుండి సమాచారాన్ని తీసుకొంటున్నట్టు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

మరో షాక్: చంద్రబాబు సమీక్షలపై ఈసీ బ్యాన్