అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఎన్నికల కమిషన్‌ మరోసారి షాకిచ్చింది.  పలు శాఖలపై సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడాన్ని  ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తప్పుబట్టారు.

సీఎం హోదాలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు  అమరావతిలో పోలవరం ప్రాజెక్టు పనుల పురుగోతిపై సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షతో పాటు తాగునీటి సమస్య ఇతర సమస్యలపై ఆయన సమీక్ష  చేశారు.

ఈ సమీక్షలపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. విమర్శలు కూడ చేసింది. అయితే  జూన్ 8వ తేదీ వరకు తాను సీఎంగా ఉంటానని కూడ ఆయన చెప్పారు. తమది అపద్ధర్మ ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు.

కొత్త నిర్ణయాలు తీసుకోకూడదని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. సాధారణ పాలనలో భాగంగా సమీక్షలు నిర్వహించడంలో తప్పేం ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ పరిణామాల నేపథ్యంలో  ఈసీ గురువారం నాడు స్పందించింది.అధికారులతో సమీక్షలు నిర్వహించడం, వీడియో కాన్పరెన్స్‌లు నిర్వహించడం కూడ ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తోందని ఈసీ అభిప్రాయపడింది.

ఈ మేరకు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికారులు ఏం చేయాలనే విషయమై మరోసారి అధికారులకు గైడ్‌లైన్స్‌ను ఈసీ పంపింది.  ఇదిలా ఉంటే గురువారం నాడు రాష్ట్రంలో హోం శాఖపై  చంద్రబాబునాయుడు నిర్వహించాల్సిన సమీక్షను రద్దు చేసుకొన్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

గవర్నర్‌కు జగన్ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఆరా