Asianet News TeluguAsianet News Telugu

దొంగ ఓట్ల రగడ: చంద్రబాబు మాటకు జగన్ మాటల తూటా

హత్య చంద్రబాబు నాయుడే చేస్తాడని కానీ నేరస్థుడు వేరేవాడని చెప్తాడంటూ విరుచుకుపడ్డారు. తానే దొంగతనం చేస్తాడు కానీ మిద్దెక్కి దొంగే దొంగ దొంగ అన్న చందంగా అరుస్తాడంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 50 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని తొలగించేందుకు ఫామ్ 7న అప్లై చెయ్యాలన్నారు. 
 

YS Jagan retaliates Chandrababu comments on fake votes
Author
Kakinada, First Published Mar 11, 2019, 5:40 PM IST

కాకినాడ: తెలుగు రాష్ట్రాల్లో  కలకలం రేపుతున్న ఓట్ల తొలగింపు వ్యవహారంపై వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఓట్ల తొలగించేందుకు కుట్రలు పన్నుతూ అడ్డంగా దొరికిపోయారంటూ ధ్వజమెత్తారు. 

ఏపీలో 50 లక్షల ఓట్లు దొంగఓట్లు ఉన్నాయని వాటిలో 20 లక్షల ఓట్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని స్పష్టం చేశారు. మిగిలిన 30 లక్షల ఓట్లు దొంగ ఓట్లు అని టీడీపీకి చెందిన కార్యకర్తలకు, అభిమానులకు ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. 

అలాంటి దొంగ ఓట్లను తొలగించేందుకు ఫామ్ 7ను ఉపయోగించాలని జగన్ సూచించారు. ఫామ్ 7 ఇచ్చి ఆ దొంగఓట్లు తొలగించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఫామ్ 7 అనేది కేవలం దొంగ ఓట్లకు సంబంధించి వెరిఫికేషన్ కోసం పెట్టుకునే విన్నపం మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

ఆ ఫామ్ ఎన్నికల సంఘానికి ఇస్తే ఎన్నికల సంఘం న్యాయం చేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ఫామ్ 7ను అప్లై చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం తప్పు అంటూ ప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు. ఫామ్ 7 ఇచ్చారంటూ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

హత్య చంద్రబాబు నాయుడే చేస్తాడని కానీ నేరస్థుడు వేరేవాడని చెప్తాడంటూ విరుచుకుపడ్డారు. తానే దొంగతనం చేస్తాడు కానీ మిద్దెక్కి దొంగే దొంగ దొంగ అన్న చందంగా అరుస్తాడంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 50 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని తొలగించేందుకు ఫామ్ 7న అప్లై చెయ్యాలన్నారు. 

ఎక్కడైనా ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే ఖచ్చితంగా వాటిని తొలగించేందుకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చెయ్యాలని కోరారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలైందన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు వైఎస్ జగన్. 

తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే కోటి 35 లక్షల ఓట్లు సాధించాయని వైసీపీ కోటి 30 లక్షల ఓట్లు సాధించిందని తెలిపారు. 5లక్షల ఓట్లతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అందువల్ల ప్రతీ ఒక్కరూ తమకు ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ జగన్.  

ఫామ్ 7పై చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఫామ్ 7పై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఓసారి చూద్దాం. 

రాబోయే ఎన్నికల్లో తమ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో 8లక్షల టీడీపీ కార్యకర్తల ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 

సాంకేతికతను మనం ప్రోత్సహిస్తుంటే..సైబర్‌ క్రైమ్‌ను వాళ్లు ప్రోత్సహిస్తున్నారన్నారు. వీటన్నింటికీ గట్టిగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, అక్రమంగా ఓట్ల తొలగింపునకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు అధికారంలోకి వస్తే ఇంకెన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారో ముందుగానే చూపిస్తున్నారని, వైసీపీ కుట్రలను సమర్ధంగా తిప్పికొట్టాలన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

సీఎం అయితే ప్రజల డేటాను దొంగిలిస్తావా..బుద్ధిలేదా : చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు నయవంచకుడు, ఓట్ల దొంగ: వైఎస్ జగన్ నిప్పులు

ఒక్క అవకాశం ఇవ్వండి, రాజన్న రాజ్యం తీసుకొస్తా: వైఎస్ జగన్

Follow Us:
Download App:
  • android
  • ios