ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై చంద్రబాబు  చేసిన కామెంట్స్ కి ట్విట్టర్ లో ధీటుగా సమాధానం ఇచ్చాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే... ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు ప్రతి పక్ష పార్టీ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిశోర్ ఓ బీహార్ డెకాయిట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్షంగా ఆయన పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ప్రశాంత్ కిశోర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘బీహార్ నుంచి వచ్చిన డెకాయిట్ ఏపీలో ఓట్లను తొలగిస్తున్నారు.’ అని చంద్రబాబు అన్నారు. 

కాగా ఈ కామెంట్స్ కి ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ఓటమి దగ్గరలో ఉన్న ప్రతి నాయకుడు ఈ విధమైన కామెంట్స్ చేస్తుంటారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. కాబట్టి తాను ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలను చూసి ఆశ్చర్యపోను అంటూ చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబుని ఉద్దేశించి..బీహార్ కి వ్యతిరేకంగా మీ దురాభిమానాన్ని చూపిస్తూ.. ఇలాంటి భాషను వాడే బదులు.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీకు మళ్లీ ఎందుకు ఓట్లు వేయాలి అనే విషయంపై దృష్టి పెడితే మంచిదంటూ హితవు పలికారు.