Asianet News TeluguAsianet News Telugu

అతి చేస్తే తోకలు కట్ చేస్తా: జగన్‌, కేసీఆర్‌లపై బాబు

రాష్ట్రంలో 8 లక్షల ఓట్లను  తొలగించారని.. ఈ విషయమై ఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అతిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తే తోకలు కట్ చేస్తానని బాబు హెచ్చరించారు.

chandrababu naidu sensational comments on ys jagan and kcr
Author
Chittoor, First Published Mar 4, 2019, 3:16 PM IST

చిత్తూరు: రాష్ట్రంలో 8 లక్షల ఓట్లను  తొలగించారని.. ఈ విషయమై ఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అతిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తే తోకలు కట్ చేస్తానని బాబు హెచ్చరించారు.

సోమవారం నాడు చిత్తూరు  జిల్లా చిప్పల్లి వద్ద హంద్రీనీవా జలాలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జలహారతి ఇచ్చారు.
 ఈ సందర్భంగా నిర్వహించిన సభలో  బాబు కేసీఆర్, జగన్ ,మోడీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. ఈ విషయమై ఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇప్పుడు మీ ఓట్లు కొట్టేస్తున్నారు, అధికారంలోకి వస్తే మీ ఆస్తులను కొట్టేసే ప్రయత్నం  చేస్తారని వైసీపీపై చంద్రబాబునాయుడు ఆరోపణలు చేశారు. వాళ్లకు తెలిసిందంతా దోపీడీ, దొంగతనాలు చేయడమేనని బాబు వైసీపీపై విమర్శలు చేశారు. ఏటీఎంలను దోచుకోవడం, నకిలీ కరెన్సీని పంచిన చరిత్ర వైసీపీ నేతలదని బాబు గుర్తు చేశారు.

బీహార్ నుండి  వైసీపీ కోసం పనిచేసేందుకు పీకే అంటూ ఓ సలహాదారుడు వచ్చాడని బాబు ఎద్దేవా చేశారు. ఇది బీహార్ కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటూ చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. అతి చేస్తే తోకలు కట్ చేస్తానని చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

 ప్రపంచంలో తెలుగు వారి  కోసం తాను పనిచేస్తానని బాబు చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తాను పాటుపడుతానని బాబు ప్రకటించారు.జగన్, కేసీఆర్, మోడీలు ముగ్గురు కలిసినా కూడ ఏం చేయలేరని బాబు ధీమాను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

మా జోలికొస్తే ...ఖబడ్దార్: కేసీఆర్‌కు చంద్రబాబు వార్నింగ్

సానుభూతి కోసమే కేసీఆర్‌పై ఆరోపణలు, ఏపీలో జరిగేదే జరుగుతోంది: కేటీఆర్

టీడీపీ యాప్ సర్వీస్ ప్రోవైడర్ వివాదం: కేసీఆర్‌పై భగ్గుమన్న చంద్రబాబు

ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు, రక్షణ కల్పించండి: లోకేశ్వర్ రెడ్డి

డేటా చోరీ: బాబుతో అడ్వకేట్ జనరల్ భేటీ, ఏం చేద్దాం

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు

Follow Us:
Download App:
  • android
  • ios